HTC డిజైర్ 826 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

2 జిబి ర్యామ్ ఆక్టో కోర్ ప్రొసెసర్, ధర 26,990 రూ.

HTC డిజైర్ 826 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్

డిజైర్ 826 పేరుతో ఒక డ్యూయల్ సిమ్ మోడల్ ను లాంచ్ చేసింది HTC. దీని ధర మాత్రం బడ్జెట్ లో లేదు. 26,990 రూ లకు ఈ నెల చివరికి అల్లా సెల్ అవనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డిజైర్ 826 స్పెసిఫికేషన్స్ – 13MP కెమేరా, 5MP అల్ట్రా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా దీనిలో ఉన్నాయు. అల్ట్రా పిక్సెల్ లోనే ప్రతీ పిక్సెల్ నార్మల్ పిక్సెల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. దీని వలన ఎక్కువ లైటింగ్ ప్రదర్శించబడుతుంది. అంటే లో లైటింగ్ కండిషన్స్ కు మంచి ఫోటోలను ఇస్తుంది అల్ట్రా పిక్సెల్.

అయితే ఇప్పటివరకూ htc అల్ట్రా పిక్సెల్ ను బ్యాక్ కెమెరాలకు ఇచ్చింది. కాని అల్ట్రా పిక్సెల్ తక్కువ MP కలిగిన కెమేరా లకు మాత్రమే దాని అవసరం ఉంటుంది. అంటే బ్యాక్ కేమెరా కన్నా తక్కువ మెగా పిక్సెల్స్ ఉండే ఫ్రంట్ కెమేరా కు అల్ట్రా పిక్సెల్ ఉండాలి. ఇప్పుడు htc కరెక్టుగా ఎక్కడ అల్ట్రా పిక్సెల్ ను ఇవ్వాలో అక్కడే ఇచ్చింది. డిజర్ 826 కు డ్యూయల్ బూమ్ సౌండ్ స్పీకర్స్ డాల్బీ డిజిటల్ టెక్నాలజీ ను జోడించారు. రెండుకు మించి ఎక్కువ కలర్స్ లో రానున్న ఈ మోడల్ ఆండ్రాయిడ్ లాలిపాప్ పై పనిచేస్తుంది.

అయితే లేటెస్ట్ గా మొన్న డిల్లీ లో htc బ్రాండ్ పై ఫోన్ రిటేల్ స్టోర్స్ యాజమాన్యాల నుండే వ్యతిరేక ప్రచారం జరిగింది. దీనికి సంబందించిన అధిక సమాచారం ఈ లింక్ లో చదవగలరు. దానికి తోడూ 15 వేల లోపు అవేలబల్ అవుతున్న స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను HTC 26,990 లకు అమ్ముతుంది. 

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo