స్మార్ట్ ఫోన్ హ్యాంగింగ్ సమస్యను తొలగించేందుకు అనువైన టిప్స్ తెలుసుకోండి

స్మార్ట్ ఫోన్ హ్యాంగింగ్ సమస్యను తొలగించేందుకు అనువైన టిప్స్ తెలుసుకోండి
HIGHLIGHTS

మీ ఫోన్ హ్యాంగింగ్ సమస్యను చాలా సులభంగా తీసివేయవచ్చు

మీ ఫోన్ హ్యాంగింగ్ సమస్య నుండి తప్పించుకోవచ్చు.

ఫోన్ యొక్క పనితీరును పూర్తిగా గాడిలో పెట్టవచ్చు.

Smartphone..ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క క్షణం కూడా గడవనంతగా కాలం మారిపోయింది. వినోదం తో పాటుగా, కెమెరా మరియు కొన్ని సాధారణ పనులతో పాటుగా మనం ఆఫీసుకు లేదా మరేదైనా పనులకోసం మెయిలింగ్ వరకు అన్ని పనులను ఈ స్మార్ట్ ఫోనుతో చక్కబెట్టేయవచ్చు. అందుకే, ఇది అంతగా అందరిని ఆకర్షించింది. అయితే, ప్రతి స్మార్ట్ ఫోన్ ఏదోఒక సమయంలో ఎదుర్కొన్న సమస్య ఒకటుంది. అదే ఫోన్ హ్యాంగింగ్ సమస్య. కానీ ఈ సమస్యకు నిర్దోధించడానికి కూడా చక్కని పరిస్కారాలున్నాయి.                                         

ఇక్కడ అందించిన సులభమైన టిప్స్ ద్వారా మీ ఫోన్ హ్యాంగింగ్ సమస్యను చాలా సులభంగా మీ ఫోన్ నుండి తీసివేయవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ సమస్యను  పూర్తిగా వదిలించుకోవచ్చు. ప్రథమంగా,  మీ ఫోన్ యొక్క బ్యాగ్రౌండ్ అప్లికేషన్లను ఆపివేయడం ద్వారా, మీరు ఇన్స్టాంట్ గా మీ ఫోన్ హ్యాంగింగ్ సమస్య నుండి తప్పించుకోవచ్చు. అయితే, ఈ క్రింద అందించిన టిప్స్ అనుసరిస్తే మీ ఫోన్ యొక్క  పనితీరును పూర్తిగా గాడిలో పెట్టవచ్చు.  

ముందుగా, మీ ఫోన్ను మరోసారి రిఫ్రెష్ చేయడానికి, మీరు క్లీన్ మాస్టర్‌ని ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించడానికి, మీ ఫోన్ Home Screen ‌కు వెళ్లండి. మీరు ఇప్పుడు క్లీన్ మాస్టర్ యాప్‌ కు వెళ్లాలి. ఇక్కడ మీరు మెమరీ బూస్ట్ ఎంపికపై క్లిక్ చేయాలి. చివరగా  మీరు బూస్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీరు దీన్ని చేసిన వెంటనే, మీ ఫోన్ మరోసారి పూర్తి శక్తితో పనిచేయడానికి సిద్ధంగా వుంటుంది.

అయితే, ఈ క్రింద ఇవ్వబడిన స్టెప్స్ అనుసరించడం ద్వారా కూడా మీ ఫోన్ యొక్క వేగాన్ని మరింతగా పెంచుకోవచ్చు.

మీ ఫోన్ నుండి పాత Apps (ఉపయోగంలో లేని ఆప్స్) UnInstall  చేయండి.

ఇందుకోసం, మొదట సెట్టింగుల ఎంపికకు వెళ్ళండి

ఇక్కడ ఇచ్చిన ఆప్స్ ఎంపికకు వెళ్లి, యాప్ మరియు నోటిఫికేషన్ (అప్లికేషన్ మేనేజర్) ఎంపికను నొక్కండి

ఇక్కడ All టాబ్‌కు వెళ్లి అక్కడ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన అన్ని Apps చూడవచ్చు.

ఈ జాబితా నుండి మీరు అన్‌ ఇన్‌స్టాల్ చేయదలిచిన Apps ఎంచుకోండి

ఇప్పుడు మీరు ఎంచుకున్న Apps ని  UnInstall  చేయండి  

గమనిక: ఒకవేళ, అన్‌ ఇన్‌స్టాల్ బటన్ను నొక్కిన తర్వాత కూడా ఆ Apps డిలీట్ అవ్వకపోతే, ఇది మీరు తొలగించలేని విధంగా మొబైల్ తయారీదారు ముందే ఇన్‌స్టాల్ చేసిన App  కావచ్చు, కాబట్టి వాటిని అలానే వదిలివేయండి.

అదేవిధంగా మీరు తీసివేయాలనుకుంటున్న మరే ఇతర App కోసం అయినా ఇదే విధానాన్ని అనుసరించవచ్చు.

పాత Files ను క్లియర్ చేయండి

Menu కి వెళ్లి Downloads లేదా ఫైల్స్ ఎంపికపై నొక్కండి

ఇక్కడ ఎక్కువసేపు నొక్కండి మరియు మీరు తొలగించాలనుకుంటున్న ఏదైనా ఫైళ్ళను తొలగించండి.

ఇప్పుడు ట్రాష్ బటన్‌పై నొక్కండి మరియు కన్ఫర్మ్ చేయండి

Cashe క్లియర్

సెట్టింగుల ఎంపికకు వెళ్లి ఇక్కడ స్టోరేజి & USB ఎంపికను నొక్కండి

ఇప్పుడు కాష్ చేసిన డేటా ఎంపికపై నొక్కండి

ఇప్పుడు Ok బటన్ ఎంపికపై నొక్కండి

ఈ విధంగా మీ ఫోన్హ్యాం యొక్క హ్యగింగ్ సమస్య నుండి  తప్పుంచుకోవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo