ఇండియాలో విడుదల కానున్న HONOR 9X స్మార్ట్ ఫోన్

ఇండియాలో విడుదల కానున్న HONOR 9X స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Honor 9X టీజింగ్ ను కూడా చూపిస్తోంది.

గత నెలలో, హానర్ ఇండియా తన హానర్ 9 X స్మార్ట్‌ ఫోన్ను 2020 జనవరిలో భారతదేశంలో విడుదల చేయవచ్చని సూచించే కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ చైనా ప్రధాన సంస్థ తన తదుపరి ఎక్స్ సిరీస్ టీజర్‌ తో 2020 సంవత్సరాన్ని ప్రారంభించింది. హానర్ త్వరలో భారతదేశంలో 9 X ను విడుదల చెయ్యడానికి సిద్ధమవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈ ఫోను కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది మరియు దీని టీజింగ్ ను కూడా చూపిస్తోంది.       

హానర్ ప్రస్తుతం హానర్ 9 ఎక్స్ యొక్క రెండు వేరియంట్లను విక్రయిస్తోంది, ఒకటి చైనా మార్కెట్ కోసం మరియు మరొకటి ప్రపంచ మార్కెట్ కోసం. చైనీస్ వేరియంట్ కిరిన్ 810 చిప్‌ సెట్‌ తో పనిచేస్తుండగా గ్లోబల్ వేరియంట్‌ లో కిరిన్ 710 F ను అమర్చారు. భారతదేశంలో ఏ వేరియంట్ లాంచ్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే గ్లోబల్ వేరియంట్లను అందించే అవకాశం ఉంది.

చైనాలో లభించే హానర్ 9 ఎక్స్ స్మార్ట్‌ ఫోన్‌ లో, ఒక 6.59-అంగుళాల ఫుల్-HD + (1080×2340 పిక్సెల్స్) డిస్ప్లేతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 9Pie  ఆధారిత EMUI 9.1.1 లో నడుస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6 జిబి వరకు ర్యామ్ ఉన్న హిసిలికాన్ కిరిన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇన్‌ బిల్ట్ స్టోరేజ్‌ లో మీకు 64 జీబీ, 128 జీబీ ఇచ్చారు, వీటిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి 512 జీబీ వరకు పెంచవచ్చు.

ఇక ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోనులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే, ఒకటి f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. అలాగే, డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్స్. అదే సమయంలో, సెల్ఫీ కెమెరా కోసం f / 2.2 ఎపర్చరుతో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఇవ్వబడింది మరియు ఒక 4,000 mAh బ్యాటరీతో. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5, 3.5 mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo