హానర్ 30V 5G సపోర్టుతో నవంబరులో లాంచ్ కానుంది
ఈ ఫోన్ యువ తరాన్ని మరింత ఆకర్షించగలదని చెబుతున్నారు.
ఇటీవల, హానర్ త్వరలో తీసుకురానున్న తన హానర్ వి 30 ప్రో 5 జి మొబైల్ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ ను ప్రకటించింది. ఒక 5 జి కనెక్టివిటీతో ఉన్న హానర్ వి 30 ప్రో వచ్చే నెలలో అంటే నవంబర్‌లో లాంచ్ అవుతుందని, సంస్థ యొక్క ప్రెసిడెంట్ జావో మింగ్ వెల్లడించారు. అయితే, అధికారికంగా ఏ లాంచ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు.
Surveyహానర్ ప్రెసిడెంట్ జావో మింగ్ ప్రకారం, త్వరలో రానున్న ఈ హానర్ స్మార్ట్ ఫోన్ స్టాండ్ అలోన్ మరియు నాన్-స్టాండ్ అలోన్ మోడళ్లతో రావచ్చు. ఈ ఫోన్ యువ తరాన్ని మరింత ఆకర్షించగలదని చెబుతున్నారు.
కొన్నిరూమర్స్ ప్రకారం, ఈ హానర్ వి 30 ప్రో 5 జి మోడల్ లైనప్‌లో భాగంగా ఉంటుంది. ఇది సంస్థ యొక్క కిరిన్ 990 5 జి చిప్ సెట్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చు. దీనితో పాటు, ఆప్టిక్స్ పరంగా, ఫోన్‌కు ఒక 60MP వెనుక కెమెరా మరియు OLED స్క్రీన్ ఇవ్వవచ్చు. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ పంచ్ హోల్స్ కూడా ఇవ్వవచ్చు.
కిరిన్ 990 యొక్క 4 జి వెర్షన్‌ను హానర్ వి 30 మోడల్‌లో ఉపయోగించవచ్చు. సింగిల్ పంచ్ హోల్‌తో ఎల్‌సిడి స్క్రీన్ కూడా. దాని వనిల్లా మోడల్‌లో 22.5W మరియు 40W వైర్డు మరియు 15W వైర్‌లెస్‌ను ప్రో వేరియంట్‌లో ఉపయోగించవచ్చు.