హానర్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా వచినటువంటి స్మార్ట్ ఫోన్ అయినటువంటి హానర్ 20 యొక్క సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. అయితే, ఈ ఫోన్ దాని ప్రత్యేకతల కంటే సంస్థ దానిపైన ప్రకటించిన విలక్షణమైన మరియు సూపర్ అఫర్ ద్వారా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ రోజు జరగనున్న సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసేవారు, ఈ ఫోన్ను వాడిన తరువాత నచ్చక పోయినట్లయితే, 90రోజుల్లో కంపెనీకి తిరిగి ఇవ్వవచ్చు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ స్మార్ట్ ఫోనులో అందించిన కెమేరా పనితనం మరియు యూజర్ ఎక్స్పీరియన్స్ వారిని కట్టిపడేస్తాని, వాటిని తిరిగి ఇవ్వదానికి వినియోగదారులు ఎంతమాత్రమూ ఇష్టపడరని, ఈ సంస్థ ధీమా వ్యక్తం చేసింది.
హానర్ 20 ధర కేవలం 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజితో లభిస్తుంది – ధర : Rs. 32,999
ఈ హానర్ 20 స్మార్ట్ ఫోన్ ఒక పంచ్ హోల్ డిజైనుతో వస్తుంది. ఇది ఒక 6.25 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిస్ప్లేతో 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. ఇక హానర్ 20 స్మార్ట్ ఫోన్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, హువావే యొక్క ఇది 7nm హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి Kirin 980 ఆక్టా కోర్ ప్రోసిజర్ శక్తితో నడుస్తుంది. ఇందులో, 20W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన ఒక 3,750mAh బ్యాటరీని అందించారు. ఇది కేవలం 30 నిముషాల్లోనే ఈ బ్యాటరీని 50% వరకూ ఛార్జ్ చేయగలదని సంస్థ పేర్కొంది. ఇక OS విషయానికి వస్తే, ఇది ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారియమైన EMUI 9.0.1 తో నడుస్తుంది .
ముఖ్యంగా, ఇవి వెనుక భాగంలో ఒక క్వాడ్ రియర్ కెమేరా సెటప్పుతో వస్తుంది. హానర్ 20 లో, ప్రధాన కెమేరా f/1.4 అపర్చరు కలిగిన 48MP కెమేరా Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక దీనికి జతగా, 16MP సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా, 2MP డెప్త్ కెమేరా మరియు 2MP మాక్రో కెమేరాలు ఉంటాయి. ఈ కేమెరాతో గొప్ప ఫోటోలతో పాటుగా అద్భుతమైన వీడియోలను కూడా తీసుకోవచ్చు. ఇక ముందుభాగంలో, ఒక 32MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క SAR వాల్యూ కూడా భారతీయ స్టాండర్డ్ వాల్యూ 1.6W/kg కంటే తక్కువగా ఉంటుంది. దీని యొక్క SAR వాల్యూ 1.08 W/kg గా వుంది.