HMD Vibe 2 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించింది.!

HIGHLIGHTS

హెచ్ఎండి బడ్జెట్ సిరీస్ అయిన వైబ్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అనౌన్స్ చేసింది

నెక్స్ట్ జనరేషన్ HMD Vibe 2 5G ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రూమార్డ్ ఫీచర్లు మరియు స్పెక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి

HMD Vibe 2 5G: హెచ్ఎండి బడ్జెట్ సిరీస్ అయిన వైబ్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అనౌన్స్ చేసింది. గత సంవత్సరం ఈ సిరీస్ నుంచి రూ. 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ అందించిన హెచ్ఎండి, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ వైబ్ 2 5జి ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

HMD Vibe 2 5G: లాంచ్ డేట్

హెచ్ఎండి వైబ్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా పక్కాగా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ 2026 మే నెలలో లాంచ్ అవుతుందని టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ కొత్త అప్డేట్ ను విడుదల చేసింది.

HMD Vibe 2 5G: రూమార్డ్ అండ్ అంచనా స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలు రిలీజ్ చేయలేదు. ఈ ఫోన్ 2026 మే నెలలో లాంచ్ అవుతుందని మాత్రమే హెచ్ఎండి ప్రకటించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రూమార్డ్ ఫీచర్లు మరియు స్పెక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ లో వచ్చిన రూమర్స్ ప్రకారం, హెచ్ఎండి వైబ్ 2 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ యూజర్ ను ఆకర్షించే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6.75 ఇంచ్ HD+ IPS LCD ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్ 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ ఫోన్ ప్రోసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను Unisoc T7200 బడ్జెట్ 5జి ప్రోసెసర్ తో లాంఛ్ చేసే అవకాశం ఉండొచ్చని కూడా రూమర్స్ ఉన్నాయి. అయితే, కెమెరా పరంగా ఈ ఫోన్ ఆకట్టుకునేలా ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. అదేమిటంటే, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని రూమర్లు చెబుతున్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ అప్ కమింగ్ హెచ్ఎండి స్మార్ట్ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ IP52 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో కూడా వచ్చే అవకాశం ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి.

Also Read: Motorola QD Mini LED స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

అయితే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వివరాలు అన్నీ కూడా నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్న రూమర్స్ మాత్రమే అని గమనించాలి. కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ లేదా ఫీచర్స్ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :