సిల్వర్ జూబ్లీ కానుకగా Nokia 3210 ను కొత్త టచ్ తో రీ లాంచ్ చేసిన HMD
నోకియా కంపెనీ యొక్క ఐకానిక్ ఫోన్ గా Nokia 3210 కి మంచి గుర్తింపు వుంది
ఈ ఫోన్ ఉనికిలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది
సిల్వర్ జూబ్లీ కానుకగా ఈ ఫోన్ ను కొత్త టచ్ మరియు ఫీచర్ లతో అందించింది
నోకియా కంపెనీ యొక్క ఐకానిక్ ఫోన్ గా Nokia 3210 కి మంచి గుర్తింపు వుంది. ఈ ఫోన్ ను 1999 లో కంపెనీ విడుదల చేసింది మరియు ఈ ఫోన్ ఉనికిలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. అందుకే, సిల్వర్ జూబ్లీ కానుకగా ఈ ఫోన్ ను నేటి తరానికి సరిపడేలా కొత్త టచ్ మరియు ఫీచర్ లతో అందించింది. ఈ ఫీచర్ ఫోన్ కొత్త స్టైలిష్ లుక్ మరియు కలర్ ఆప్షన్ లలో కూడా లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు మరో రెండు కొత్త ఫోన్ కూడా విడుదల చేసింది.
SurveyNokia 3210 : ధర మరియు సేల్
నోకియా 3210 ఫీచర్ ఫోన్ ను రూ. 3,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్, HMD అధికారిక సైట్ మరియు అన్ని ప్రధాన అవుట్ లెట్స్ లో లభిస్తుంది. ఈ నోకియా ఫీచర్ ఫోన్ గ్రంజ్ బ్లాక్, స్కూబా బ్లూ మరియు వై2కె గోల్డ్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
Nokia 3210 : ప్రత్యేకతలు
HDM రీ లాంచ్ చేసిన ఈ నోకియా ఫీచర్ ఫోన్ కొత్త క్లాసిక్ కీ ప్యాడ్ తో వస్తుంది. ఈ ఫీచర్ ఫోన్ 4G సపోర్ట్ తో వస్తుంది మరియు ఆకర్షణీయమైన కొత్త లుక్ లో వచ్చింది. ఈ నోకియా ఫోన్ YouTube, Scan & Pay UPI ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో వెనుక రియర్ కెమెరా కూడా వుంది.

HMD అందించిన ఈ నోకియా ఫీచర్ ఫోన్ MP3 ప్లేయర్ మరియు వైర్లెస్ FM ఫీచర్ లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో బ్లూటూత్ 5.0 మరియు USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ను 2.4 ఇంచ్ పెద్ద స్క్రీన్ తో అందించింది.
Also Read: MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను లాంచ్ చేసిన అంబ్రేన్.!
ఈ ఫోన్ తో పాటుగా Nokia 235 4G ఫీచర్ ఫోన్ ను కూడా HMD అందించింది. ఈ ఫోన్ ను రూ. 3,749 ధరతో అందించింది. ఈ ఫోన్ ను కూడా 4G సపోర్ట్, రియర్ కెమెరా, UPI స్కాన్ అండ్ పే మరియు 2.8 ఇంచ్ బిగ్ డిస్ప్లేతో అందించింది. ఈ ఫోన్ కూడా అమెజాన్ మరియు HMD అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile