MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను లాంచ్ చేసిన అంబ్రేన్.!

HIGHLIGHTS

అంబ్రేన్ కొత్త ప్రోడక్ట్ ను విడుదల చేసింది

అంబ్రేన్ కొత్త MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను విడుదల చేసింది

ఈ స్టాండ్ డ్యూయల్ మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో

MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను లాంచ్ చేసిన అంబ్రేన్.!

భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ లీడింగ్ ఇండియన్ కంపెనీ, అంబ్రేన్ కొత్త ప్రోడక్ట్ ను విడుదల చేసింది. భారత మార్కెట్ లో పెరుగుతున్న వైర్లెస్ ఛార్జ్ అవసరాలను గుర్తించిన అంబ్రేన్, కొత్త MagSafe 2-in-1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను విడుదల చేసింది. ఈ కొత్త మెగ్ సేఫ్ 2 ఇన్ 1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ ను కటింగ్ ఎడ్జ్ టెక్నాలాజి తో డ్యూయల్ మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane MagSafe 2-in-1: ఫీచర్లు

అంబ్రేన్ ఈ కొత్త మెగ్ సేఫ్ 2 ఇన్ 1 వైర్లెస్ చార్జర్ స్టాండ్ 20W టోటల్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది. అంతేకాదు, ఒకేసారి ఐఫోన్ మరియు ఎయిర్ ప్యాడ్స్ ని ఈ స్టాండ్ తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కొత్త అంబ్రేన్ ఛార్జర్ స్టాండ్ ఐఫోన్ 15/15 ప్లస్/15 ప్రో/15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 12/13/14 సిరీస్ ఫోన్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ స్టాండ్ మెయిన్ పాయింట్ లో 15W ఛార్జ్ ను సబ్ పాయింట్ నుండి 5W ఛార్జ్ ను అందిస్తుంది.

Ambrane MagSafe 2-in-1 charger stand
Ambrane MagSafe 2-in-1 charger stand

ఈ అంబ్రేన్ ఛార్జర్ స్టాండ్ లో LED ఇండికేటర్ కలిగిన స్టైలిష్ బేస్ వుంది. ఇది ప్రీమియం మెటల్ బిల్డ్ తో గట్టిగా ఉంటుంది. ఈ ఛార్జర్ స్టాండ్ టైప్ C ఛార్జ్ పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది మరియు చాలా తేలికగా ఉంటుంది. ఇది యూనివర్సల్ రింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఛార్జర్ స్టాండ్ ల్యాండ్ స్కేప్ మరియు పోర్ట్రైట్ మోడ్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఈ ఛార్జర్ స్టాండ్ 27W ఫాస్ట్ ఇన్ పుట్ సపోర్ట్ కలిగిన టైప్ C పోర్ట్ తో ఉంటుంది. ఈ చార్జర్ స్టాండ్ ను హై క్వాలిటీ మెటల్ తో అందించినట్లు కూడా అంబ్రేన్ తెలిపింది.

Also Read: Soundbar: 70 శాతం డిస్కౌంట్ తో రూ.3,999 కే లభిస్తున్న బ్రాండెడ్ వర్చువల్ 5.1 సౌండ్ బార్.!

Ambrane MagSafe 2-in-1: ధర

అంబ్రేన్ ఈ కొత్త మెగా సేఫ్ చార్జర్ స్టాండ్ ను రూ. 2,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ చార్జర్ స్టాండ్ అంబ్రేన్ కంపెనీ అధికార వెబ్సైట్ మరియు అమెజాన్ ఇండియా నుండి లభిస్తుంది. ఈ ఛార్జర్ స్టాండ్ ను అమెజాన్ నుండి నేరుగా కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo