2020 లో NOKIA ప్యూర్‌ వ్యూ 5G చిప్ సెట్ తో లాంచ్ చెయ్యొచ్చు

2020 లో NOKIA  ప్యూర్‌ వ్యూ 5G చిప్ సెట్ తో లాంచ్ చెయ్యొచ్చు
HIGHLIGHTS

నోకియా 9.2 ప్యూర్‌ వ్యూ పేరుతో లాంచ్ చేయవచ్చు.

HMD గ్లోబల్ తన 2020 ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్‌ కోసం పనిచేస్తోంది, దీనిని 2020 చివరిలో నోకియా 9.2 ప్యూర్‌ వ్యూ పేరుతో ప్రారంభించవచ్చు. టిప్‌స్టర్ నోకియా న్యూ ప్రకారం, రాబోయే స్మార్ట్‌ ఫోన్ను నోకియా 9.2 ప్యూర్‌ వ్యూ పేరుతో లాంచ్ చేయవచ్చు. ఈ పరికరం క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 5 జి చిప్‌ సెట్ ద్వారా శక్తినివ్వనుంది.

క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 855 ప్రాసెసర్, పెంటా-కెమెరా సెటప్‌ తో 2020 లో నోకియా 9.1 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ ఫోన్ను కంపెనీ విడుదల చేయనున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అయితే, కంపెనీ నోకియా 9.2 ప్యూర్ వ్యూ పేరుతో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

అయితే, రాబోయే నోకియా స్మార్ట్‌ఫోన్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. గత సంవత్సరం లాంచ్ చేసిన నోకియా 9 ప్యూర్ వ్యూ లో ఒక 5.99-అంగుళాల P -OLED  డిస్ప్లే ఉంది మరియు డిస్ప్లే కి 2 కె రిజల్యూషన్ మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియో ఇవ్వబడింది మరియు ఈ డిస్ప్లే HDR 10 సర్టిఫికేట్ ని కలిగివుంది. నీరు మరియు ధూళి నిరోధకత కోసం ఈ పరికరం IP67 తో రేట్ చేయబడింది మరియు ఫోన్ యొక్క డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్  అండర్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు AI ఆధారిత ఫేస్ అన్‌ లాక్ ఫీచర్‌ తో ఉంటుంది. ఈ ఫోన్ను 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకువచ్చారు మరియు ఫోన్‌ లో 3320 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది క్విక్ ఛార్జ్ 3 కి మద్దతు ఇస్తుంది మరియు 10W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ ను కలిగి ఉంది మరియు స్టాక్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారపడి ఉంటుంది.

నోకియా 9 ప్యూర్‌ వ్యూ యొక్క ప్రత్యేకత దాని కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ ఫోన్ వెనుక ప్యానెల్‌ లో మొత్తం ఐదు కెమెరాలు ఇవ్వబడ్డాయి మరియు ఈ ఐదు కెమెరాలు సోనీ చేసిన 12MP రిజల్యూషన్‌ లో ఉన్నాయి. వీటిలో మూడు కెమెరా మాడ్యూల్స్ మోనో క్రోమ్ సెన్సార్లు మరియు రెండు RGB సెన్సార్లు ఉన్నాయి. అదనపు డెప్త్  సమాచారాన్ని సేకరించడానికి ఫ్లైట్ లేదా ToF  డెప్త్ సెన్సార్ అందించబడింది. కెమెరా సెటప్ డ్యూయల్ టోన్ LED  ఫ్లాష్ తో అందించబడింది. పరికరం ముందు భాగంలో 20MP కెమెరా ఉంది, ఇది f / 1.8 ఎపర్చర్‌తో వస్తుంది మరియు ఇది 4-ఇన్ -1 పిక్సెల్ బిన్నింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo