NOKIA 110 (2019) ఫీచర్ ఫోన్ విడుదల
ఈ ఫోనులో మీరు MP3 ప్లేయర్, FM రేడియో మరియు క్లాసిక్ స్నేక్ గేమ్‌ను కూడా పొందువచ్చు.
HMD గ్లోబల్ ఇండియాలో తన కొత్త ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్నుNOKIA 110 పేరుతొ లాంచ్ చేశారు మరియు దీన్న రూ .1,599 రుయాల ధరతో లాంచ్ చేశారు. ఈ 2G పరికరాన్ని నోకియా 2720 ఫ్లిప్, నోకియా 7.2, నోకియా 6.2 మరియు నోకియా 800 టఫ్ లతో పాటు ఐఎఫ్ఎ 2019 లో మొదట లాంచ్ చేశారు. ఇది నోకియా 105 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోనులో మీరు MP3 ప్లేయర్, FM రేడియో మరియు క్లాసిక్ స్నేక్ గేమ్‌ను కూడా పొందువచ్చు. అలాగే, మీకు 19 గంటల బ్యాటరీ స్టాండ్‌బై సమయం లభిస్తుంది.
Surveyనోకియా 110 భారతదేశంలో ధర మరియు లభ్యత
నోకియా 110 మొబైల్ ఫోన్ ఓషన్ బ్లూ, బ్లాక్ మరియు పింక్ కలర్లలో అందుబాటులో ఉంది, ఇది కాకుండా మీరు అక్టోబర్ 18 నుండి భారతదేశంలోని అన్ని రిటైల్ దుకాణాల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో 1,599 రూపాయలకు విక్రయించబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
నోకియా 110 ప్రత్యేకతలు
ఈ మొబైల్ ఫోనులో మీరు ఒక 1.77-అంగుళాల QVGA కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కాకుండా, కంపెనీ ఈ మొబైల్ ఫోన్‌కు 'ఎంటర్నైన్మెంట్ ఇన్ యువర్ పోకెట్' అనే పేరును ఇచ్చింది. ఈ ఫోన్ VGA కెమెరాతో వస్తోంది, ఇది కాకుండా మీరు మ్యూజిక్ ప్లేయర్, స్నేక్ గేమ్, డూడుల్ జంప్, నింజా అప్, ఎయిర్‌స్ట్రైక్ మరియు పెనాల్టీ కప్ వంటి చాలా గొప్ప ఆటలను కూడా పొందవచ్చు.
ఈ ఫోన్ ఎఫ్ఎమ్ రేడియో మరియు 32GB మైక్రో ఎస్డి కార్డ్ సపోర్టుతో వస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ యొక్క అతిపెద్ద లక్షణం దాని స్టాండ్బై టైం, ఇది 19 రోజుల వరకు ఉంటుంది. ఈ నోకియా ఫోన్ లో 800 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని చేర్చారు. ఇది కాకుండా, మీరు డ్యూయల్ సిమ్ మద్దతుతో దీన్ని పొందవచ్చు.