Nokia 105 Classic: UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో New Phone లాంచ్.!
UPI పేమెంట్ ఫీచర్ తో Nokia 105 Classic చవక ధరలో లాంచ్
రూ. 1,000 ధరలో కొత్త నొకియా ఫీచర్ ఫోన్ లాంచ్
చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకు వచ్చింది
HMD Global ఇండియాలో Nokia 105 Classic ఫోన్ ను UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ను నోకియా రూ. 1,000 రూపాయల కంటే చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకు వచ్చింది. ఈ కొత్త నోకియా ఫీచర్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను వివరంగా చూద్దాం.
SurveyNokia 105 Classic:
నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ను Rs. 999 ధరతో ఇండియన్ మార్కెట్ లో నోకియా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ను ఎక్కువ కాలం మన్నేలా గట్టి డిజైన్ తో అందించినట్లు నోకియా తెలిపింది. ఈ నోకియా ఫీచర్ ఫోన్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది.
Also Read : Great Deal: 20 వేలకే QLED Smart tv ఆఫర్ చేస్తున్న Flipkart.!
నోకియా 105 క్లాసిక్ ప్రత్యేకతలు
నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ఇన్ బిల్ట్ UPI అప్లికేషన్ తో వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ ఫోన్ తో కూడా మీరు UPI పెమెంట్స్ ను చేసుకోవచ్చు. ఈ నోకియా ఫీచర్ ఫోన్ గట్టి డిజైన్ మరియు మంచి కీప్యాడ్ తో వస్తుంది. ఈ ఫోన్ ను జేబులో పెట్టుకొని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉండేలా మరియు చేతిలో మరింత కంఫర్ట్ గా ఉండేలా ఈ ఫోన్ ను అందించినట్లు కూడా చెబుతోంది.

ఈ నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ 800mAh తో వస్తుంది కాబట్టి, ఫుల్ ఛార్జ్ చేసిన తరువాత రోజులు తరబడి పని చేస్తుంది. ఈ ఫోన్ wireless FM radio తో మరియు Improved Audio తో కూడా ఉంటుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్ సింగిల్ మరియు డ్యూయల్ SIM ఆప్షన్ లలో కూడా లభిస్తుంది.
Also Read : Unlimited లాభాలను మరియు Prime Video ఉచితంగా ఆఫర్ చేసే Jio బెస్ట్ ప్లాన్.!
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile