కేవలం రూ.4,200 ధరలో విడుదలైన NOKIA C1 స్మార్ట్ ఫోన్

కేవలం రూ.4,200 ధరలో విడుదలైన NOKIA C1 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

నోకియా సి 1 ను ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్ స్మార్ట్‌ ఫోను గా పరిచయం చేసింది.

HMD  గ్లోబల్ తన నోకియా బ్రాండ్ కింద C సిరీస్‌ ను తిరిగి ప్రవేశపెట్టింది మరియు నోకియా సి 1 ను ఆండ్రాయిడ్ 9 గో ఎడిషన్ స్మార్ట్‌ ఫోను గా పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్ను నోకియా 2.3 పేరుతో ఈజిప్టులో వారం క్రితం లాంచ్ చేశారు. ఈ పస్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు కూడా నోకియా 1 ప్లస్ నుండి చాలా భిన్నంగా లేవు, ఇప్పుడు కెన్యా, నైజీరియా మరియు కొన్ని ఇతర దేశాలలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభించబడింది. ఈ నోకియా సి 1 స్మార్ట్‌ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు కాని కెన్యాలో కెఇఎస్ 6,000 (సుమారు రూ .4,200) ధర వద్ద ఈ ఫోన్ జాబితా చేయబడింది.

ఇక ఈ నోకియా సి 1 స్మార్ట్‌ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది ఒక 5.45 అంగుళాల డిస్ప్లేను 960 x 480 పిక్సెళ్ల రిజల్యూషనుతో కలిగి ఉంది. ఈ ఫోన్ను   గీతలు నుండి రక్షించడానికి IPS ప్యానెల్‌ తో పాటు ముందు భాగంలో బలమైన గ్లాస్ ను ఉపయోగిస్తుంది. 1.3GHz వద్ద క్లాక్ చేసిన క్వాడ్ కోర్ CPU ద్వారా ఈ ఫోన్ శక్తినివ్వగలదని మరియు మీడియాటెక్ SoC అయ్యే అవకాశం ఉందని లిస్టింగ్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ పై గో ఎడిషన్ స్మార్ట్‌ ఫోనుకు ప్రామాణికమైన 1 జీబీ ర్యామ్‌ ను ఈ ఫోన్ పొందుతుంది. ఈ ఫోనుకు 16 జీబీ స్టోరేజ్ లభిస్తుంది, దీనిని మైక్రో ఎస్‌డీ కార్డుతో 64 జీబీకి వరకూ పెంచవచ్చు.

ఈ నోకియా సి 1 యొక్క వెనుక ప్యానెల్‌ లో 5 మెగాపిక్సెల్ కెమెరా అందించబడింది మరియు ఒక LED ఫ్లాష్ కూడా ఉంది. ఇది కాకుండా, సెల్ఫీ కోసం ముందు ప్యానెల్‌ లో 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది మరియు దానితో పాటు LED ఫ్లాష్ కూడా అందించబడుతుంది. ఇది 3 జి కనెక్టివిటీతో వచ్చే డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ ఫోన్. ఈ ఫోన్ 2,500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుతోంది మరియు ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo