D2M టెక్నాలజీతో కొత్త ఫోన్లు తెస్తున్న HMD మరియు Lava కంపెనీలు.!
D2M టెక్నాలజీతో కొత్త ఫోన్లు అందించే దిశగా HMD మరియు Lava ప్రయత్నం
డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ తో ఈ కొత్త ఫోన్ లను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపాయి
WAVES 2025 లో ఈ ఫోన్ లను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు
D2M టెక్నాలజీతో కొత్త ఫోన్లు అందించే దిశగా HMD మరియు Lava కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ తో ఈ కొత్త ఫోన్ లను ఆవిష్కరిస్తున్న ట్లు తెలిపాయి. HMD మరియు Lava రెండు కంపెనీలు కూడా ఈ కొత్త టెక్నాలజీతో తో మొబైల్ ఫోన్ లను తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీ తో ఫోన్స్ తీసుకురావడానికి HMD ఫ్రీస్ట్రీమ్, తేజస్ నెట్ వర్క్ మరియు సింక్లెయిర్ తో జతకట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, లావా కూడా తేజస్ నెట్ వర్క్ తో జతగా ఈ డి2ఎం మొబైల్ ను తీసుకురావడానికి చూస్తోంది. ఈ రెండు కంపెనీలు కూడా రానున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025 లో ఈ ఫోన్ లను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
Surveyలావా ఇప్పటికే ఈ అప్ కమింగ్ మొబైల్ టెక్నాలజీ మరియు ఫీచర్స్ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ మొబైల్ MediaTek MT6261 SoC మరియు Saankhya SL3000 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో టీవీ కోసం UHF యాంటెన్నా మరియు వాయిస్ కాల్స్ కోసం GSM ఉంటాయి. ఈ మొబైల్ 2.8 ఇంచ్ QVGA స్క్రీన్ మరియు 2200 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని లావా చెబుతోంది.
అయితే, HMD అప్ కమింగ్ డివైజ్ మాత్రం Saankhya Labs యొక్క SL-3000 చిప్ సెట్ తో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది యాడ్స్ టార్గెట్ గా కోర్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తాయి అని చెబుతున్నారు.
Also: CMF Phone 2 Pro టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
అసలు ఏమిటి ఈ D2M టెక్నాలజీ?
ఈ కొత్త డైరెక్ట్ టు మొబైల్ (డి2ఎం) టెక్నాలజీ అనేది డేటా తో పనిలేకుండా రేడియో తరంగాలను వీడియో గా మార్చే టెక్నాలజీ. ఇది ఇంటర్నెట్ తో పని లేకుండా లైవ్ టీవీ ఫెసిలిటీ అందిస్తుంది. ఇది నెట్ వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా చక్కగా పని చేస్తుంది. దీనికోసం ఎటువంటి ఇంటర్నెట్ లేదా Wi-Fi వంటి కనెక్టివిటీ సర్వీస్ కూడా అవసరం ఉండదు. ఇది FM Radio మాదిరిగా పనిచేసే వీడియో సోర్స్ అవుతుంది. వాస్తవానికి, ఈ కొత్త డైరెక్ట్ టు మొబైల్ (డి2ఎం) టెక్నాలజీని భారత ప్రభుత్వం ఢిల్లీ, నోయిడా,బెంగళూరు వంటి దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఇప్పటికే టెస్ట్ చేసింది.