CMF Phone 2 Pro టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

CMF Phone 2 Pro ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించింది

CMF Phone 2 Pro టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

CMF Phone 2 Pro ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్, డ్యూయల్ టోన్ కలర్, ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందించింది. సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

CMF Phone 2 Pro: ధర

సిఎంఎఫ్ ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ 8GB+ 128GB వేరియంట్ రూ. 18,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు 8GB+ 256GB వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై బెస్ట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ICICI, Axis, HDFC మరియు SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, ఎక్స్ చేంజ్ ద్వారా కొనే వారికి ఈ ఫోన్ పై రూ. 1,000 ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందిస్తుంది.

పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ CMF స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ మే 5వ తేదీ నుంచి Flipkart మరియు నథింగ్ e-store నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

CMF Phone 2 Pro: టాప్ 5 ఫీచర్స్

డిజైన్

సిఎంఎఫ్ [ఫోన్ 2 ప్రో డిజైన్ పరంగా, కేవలం 7.8mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు 185 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ ను సరికొత్త డ్యూయల్ కలర్ డిజైన్ తో అందించింది.

పెర్ఫార్మెన్స్

ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ వైప్క్క లేటెస్ట్ 4nm TSMC 5G చిప్ సెట్ Dimensity 7300 Pro తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ జతగా 8GB ర్యామ్ బూస్టర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

డిస్ప్లే

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ లో 6.77 ఇంచ్ AMOLED Flexible LTPS స్క్రీన్ ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, FHD+ రిజల్యూషన్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కెమెరా

ఈ CMF స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 2X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

బ్యాటరీ

గత జనరేషన్ ఫోన్ తో పోలిస్తే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జింగ్ కేబుల్, ఛార్జర్, ఎజెక్టర్ మరియు ప్రొటెక్టివ్ కేస్ ను కూడా ఈ ఫోన్ లో అందించడం విశేషం. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Amazon Great Summer sale ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రైమ్ సభ్యులకు స్టార్ట్ అవుతుంది.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo