ఫిబ్రవరి 6న రానున్న Realme C3 యొక్క టాప్ 5 ఫీచర్లు ఇవే

ఫిబ్రవరి 6న రానున్న Realme C3 యొక్క టాప్ 5 ఫీచర్లు ఇవే
HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లోకి మరోక రియల్మీ స్మార్ట్ ఫోన్ రాబోతోంది.

ఇండియన్ మార్కెట్లోకి మరోక రియల్మీ స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ను, రియల్మీ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయినటువంటి C సిరీస్ నుండి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది, అదే ఈ Realme C3 స్మార్ట్  ఫోన్. ఈ ఫోన్ను ఫిబ్రవరి 6 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు రియల్మీ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క 5 ప్రత్యేకతలను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రత్యేకతలు చూస్తుంటే, ఈ ఫోన్ను కెమేరా, గేమింగ్ మరియు స్పీడ్ ప్రధానంగా తీసుకురానున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ ఫోన్ గురించి మనం తెలుసుకోవాల్సిన 5 టాప్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి.

1. డిస్ప్లే

ఈ రియల్మీ C3 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని, ప్రస్తుతం రియల్మీ అన్ని ఫోన్లలో అందిస్తున్న MiniDrop నోచ్ డిస్ప్లేని ఒక 6.5 అంగుళాల పరిమాణంతో ఇస్తోంది. ఇక ఈ డిస్ప్లే ని ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యొక్క ప్రొటెక్షన్ తో మరియు 89.9% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో అందిస్తున్నట్లు, flipkart  ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించిన టీజర్ ద్వారా ప్రకటించింది. అంటే, ఈ ఫోన్ ఒక పెద్ద డిస్ప్లే మరియు ఎక్కువ స్క్రీన్ తో వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు.                                    

2. ప్రాసెసర్

మీడియా టెక్ హీలియో ఇటీవల ప్రకటించిన ఎంట్రీ లెవాల్ గేమింగ్ ప్రాసెసర్ అయినటువంటి, MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో, ఈ రియల్మీ C3 స్మార్ట్  ఫోన్ను తీసుకొస్తోంది. దీని విశేషం ఏమిటంటే, ఈ ప్రాసెసర్ తో ప్రపంచంలో ఎక్కడా ఒక ఫోన్ రాలేదు,  ఈ ప్రాసెసర్ తో వచ్చే మొట్ట మొదటి స్మార్ట్ ఫోనుగా Realme C3 ఈ జాబితాలో నిలుస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది మరియు ARM G52 GPU తో వస్తుంది. ఇది మీకు ప్రీమియం గ్రాఫిక్స్ చూసేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా, ఇది నెట్ వర్క్ ని మెరుగుపరిచేలా 300Mbps డౌన్లోడ్ లింక్ స్పీడ్ కలిగిన డ్యూయల్ 4G మోడెమ్ తో ఇది వస్తుంది. అంటే, మీ ఆన్లైన్ మరియు గేమింగ్ ఎక్స్పీరియన్సు మరింత చక్కగా మారుతుంది.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎముకలతో అందించనున్నట్లు కూడా రియల్మీ ప్రకటించింది. అవి : 3GB ర్యామ్ +32GB స్టోరేజి మరియు 4GB + 64GB స్టోరేజి వాటి రెండు వేరియంట్లను ఇప్పటి వరకు చూపిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పోర్తి ధరలు మరియు ఇతర అన్ని వివరాలను విడుదల రోజున ప్రకటిస్తుంది. కాబట్టి, మరిన్ని వివరాల కోసం అప్పటి వరకూ వేచిచూడాల్సిందే.               

4. కెమేరా

ఈ ఫోన్ లో కేవలం డ్యూయల్ కెమెరాని మాత్రమే ఇస్తునాట్లు కంపెనీ చూపిస్తోంది. ఈ డ్యూయల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 12MP ప్రధాన కెమెరాని చూపిస్తోంది. ఇక రెండవ కెమేరా గురించిన ఎటువంటి సమాచారం ఇక్కడ అందించలేదు మరియు సెల్ఫీ కెమేరా గురించిన వివరాలను కూడా ఇంకా ప్రకటించేలేదు. అయితే, ఈ కెమేరా చేయగలిగిన పనులను మాత్రం ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క కెమేరా Chroma Boost ఫీచరుతో వస్తున్నట్లు చెబుతోంది. ఇక మిగిలిన కెమేరా ప్రత్యేకతలు గురించి చూస్తే, స్లోమోషన్ వీడియో, HDR మోడ్ మరియు పనోరమా సెల్ఫీ వంటి ఫీచర్లను హైలెట్ చేసి చూపిస్తోంది.

5. బ్యాటరీ

ఈ రియల్మీ C3 ని ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో విడుదల చేస్తున్నట్లు చూపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీతో ఏ పనులు కోసం ఎంతసేపు ఈ ఫోన్ బ్యాటరీ ఉపయోగపడుతుందో కూడా చూపిస్తోంది. దీని ప్రకారం, ఈ ఫోన్ యొక్క బ్యాటరీ స్టాండ్ బై గా 30 రోజులు లైఫ్ టైం ఇస్తుంది. ఇక కాలింగ్ చేసేవారికి 43.9 గంటలు, మ్యూజిక్ వినోదానికి 19.4 గంటలు, యూట్యూబ్ లో వీడియోలను చూడానికి 20.8 గంటల లైఫ్ టైం మరియు చివరిగా PUBG మొబైల్ గేమ్ కోసం ఏకంగా 10.6 గంటల లైఫ్ ఇస్తుందని కంపెనీ తమ టీజర్ ద్వారా చెబుతోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo