POCO X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 ఫీచర్లు

POCO X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 ఫీచర్లు
HIGHLIGHTS

ఇది HDR 10 కి సపోర్ట్ చేయగల 120Hz డిస్ప్లేతో వస్తుంది.

ఇండియన్ మార్కెట్లోకి మరోక POCO స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. POCO ఈ స్మార్ట్ ఫోన్ను, కేవలం మిడ్ రేంజ్ ధరలో విడుదల చెయ్యడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే,  ఈ ఫోన్ యొక్క ఈ 5 ప్రత్యేకతల గురించి చూస్తే  మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ఫోన్ కెమేరా, గేమింగ్ మరియు స్పీడ్ ఇవన్నీ వీటిలో అంశాలుగా ఉండనున్నాయి. అందుకే, ఇక ఈ ఫోన్ గురించి మనం తెలుసుకోవాల్సిన 5 టాప్ ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి.

1. డిస్ప్లే

ఈ POCO X2 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని ప్రీమియం ఫోన్లలో మాత్రమే అందించే డిజైనుతో అందించింది. అదేమిటంటే, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)   ప్రస్తుతం ఈ ధరలో ఈ ఫీచరుతో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇదొక్కటి మాత్రమే అవుతుంది. ఇది ఒక 6.67 అంగుళాల పరిమాణం డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొ క్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10 కి సపోర్ట్ చేయగల 120Hz డిస్ప్లేతో వస్తుంది.                                        

2. ప్రాసెసర్

ఇది క్వాల్కామ్ యొక్క గేమింగ్ ప్రత్యేకమైన ప్రాసెసర్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 730G  ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది Adreno 618 GPU తో మీకు మంచి గ్రాఫిక్స్ అందిస్తుంది మరియు PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషన్ ఆడవచ్చు.  ఈ POCO X2 స్మార్ట్  ఫోనులో ఒక లిక్విడ్ కూలింగ్ టెకెబనాలజీని కూడా కలిగి ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2.2 Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది.  

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

1. POCO X2 6GB ర్యామ్  + 64GB స్టోరేజి : Rs.15,999/-

2. POCO X2 6GB ర్యామ్  + 128GB స్టోరేజి : Rs.16,999/-

3. POCO X2 8GB ర్యామ్  + 256GB స్టోరేజి : Rs.19,999/-   

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.89 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Sony IMX686 సెన్సారుతో ఇంచింది. ఈ ధరలో ఈ కెమేరాతో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.2 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, జతగా 2MP మ్యాక్రో మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP డెప్త్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విశాయిని వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీలే కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 20MP మరియు 2MP  సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో 960fps వద్ద సూపర్ స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ పోకో X2 ని ఒక అతిపెద్ద 4,700mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 27W ఛార్జర్ కూడా అందించింది.  అలాగే, ఈ ఫోన్ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో కూడా వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo