HIGHLIGHTS
2GB ర్యామ్, జులై 14 రిలీజ్.
గత సంవత్సరం గూగల్ Android One పేరుతో బడ్జెట్ ధరలో ఇండియన్ బ్రాండ్స్ నుండి కొన్ని మోడల్స్ విడుదల చేసింది. కంప్లీట్ ప్యూర్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS అప్డేట్లు ఈ సిరిస్ ప్రత్యేకం.
SurveyEconomic times రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు గూగల్ మళ్ళీ Android One సిరిస్ లో ఇండియాలో Lava బ్రాండ్ నుండి ఒక మోడల్ ను లాంచ్ చేస్తుంది. దీని ధర 12,000. బడ్జెట్ ధర కన్నా కొంచెం ఎక్కువ ధర ఉండటం వలన ఇది మంచి స్పెసిఫికేషన్స్ తో రానుంది అని అర్థమవుతుంది.
అయితే ఇందులో మీడియా టెక్ ప్రొసెసర్ మరియు 2GB ర్యామ్ ఉండనున్నాయి. ఇది జులై 14 న బయట స్టోర్స్ మరియు ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో దొరకనుంది.