గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కంటే ముందే భారీగా తగ్గిన Google Pixel 8a ధర.!

గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కంటే ముందే భారీగా తగ్గిన Google Pixel 8a ధర.!
HIGHLIGHTS

గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కంటే ముందే Google Pixel 8a స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది

గూగుల్ పిక్సల్ 8a ఇప్పుడు మిడ్ రేంజ్ ధర పరిధిలో లభిస్తుంది

లేటెస్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకే అందుకోవచ్చు

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ నుంచి రాబోతున్న బేసిక్ వేరియంట్ గూగుల్ పిక్సెల్ 9a లాంచ్ కంటే ముందే Google Pixel 8a స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో ప్రీమియం ఫీచర్స్ మరియు ధరతో వచ్చిన గూగుల్ పిక్సల్ 8a ఇప్పుడు మిడ్ రేంజ్ ధర పరిధిలో లభిస్తుంది. ఈ ఫోన్ పై అందించిన లేటెస్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత తక్కువ ధరకే అందుకోవచ్చు.

Google Pixel 8a: లేటెస్ట్ ప్రైస్

గూగుల్ పిక్సెల్ 9a భారత మార్కెట్లో రూ. 52,999 రూపాయల ధరలో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 13,000 భారీ తగ్గింపు అందుకుని కేవలం రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 36,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.

Also Read: 10 వేల భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న Samsung Dolby Atmos సౌండ్ బార్.!

Google Pixel 8a: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ Actua OLED డిస్ప్లే ని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది మరియు ఇది 24 bit డెప్త్ తో ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు Titan M2 security సహాయక ప్రోసెసర్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ 8 GB LPDDR5x ర్యామ్ మరియు 128 GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Google Pixel 8a

ఈ గూగుల్ ఫోన్ లో 64 MP క్వాడ్ PD వైడ్ మెయిన్ కెమెరా జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS/ 60 FPS వద్ద 4K video రికార్డింగ్ చేసే సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సూపర్ రిజల్యూషన్ జూమ్, మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ మరియు నైట్ సైట్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,492 mAh బ్యాటరీ మరియు Qi సర్టిఫైడ్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo