Google Pixel 8a పై రూ. 18,000 రూపాయల భారీ తగ్గింపు అందుకోండి.!
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి
ఈ ఫోన్ అన్ని ఆఫర్స్ తో కలిపి 35 వేల ఉప బడ్జెట్ లో లభిస్తుంది.
ఈ ఫోన్ రెండు ఆఫర్స్ తో రూ. 18,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుంది
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 18,000 భారీ తగ్గింపుతో మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ లో విడుదలైన గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ను గొప్ప డిస్కౌంట్ తో అందుకునే గొప్ప అవకాశం మీ ముందుంది. ఇండియాలో 55 వేల రూపాయల ఉప బడ్జెట్ లో విడుదలైన ఈ ఫోన్ ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి 35 వేల రూపాయల ఉప బడ్జెట్ లో లభిస్తుంది.
SurveyGoogle Pixel 8a : ఆఫర్స్
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 52,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 15,000 రూపాయల్ భారీ తగ్గింపు అందుకొని కేవలం రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ను HDFCబ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ నేరుగా లభిస్తుంది.

అంటే, ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈరోజు రెండు ఆఫర్స్ తో రూ. 18,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈగూగుల్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం వుంది.
Also Read: Flipkart Sale ముగిసిన తర్వాత కూడా ఈ Soundbars పై ధమాకా ఆఫర్స్ అందించింది.!
Google Pixel 8a : ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.1 ఇంచ్ 24 Bit స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 సేఫ్టీ, HDR సపోర్ట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగి ఉంటుంది.

ఈ గూగుల్ ఫోన్ 64MP + 13MP డ్యూయల్ రియర్ మరియు 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో లను 30 fps/ 60 fps వద్ద రికార్డ్ చేసే సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప కెమెరా ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4404 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.