HIGHLIGHTS
Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ బేసిక్ వేరియంట్ Google Pixel 9a స్మార్ట్ ఫోన్ ను నిన్న లాంచ్ చేసింది. ఈ ఫోన్ రాకతో గూగుల్ పిక్సెల్ పాత ఫోన్ గూగుల్ పిక్సెల్ 7a పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో 40 వేల బడ్జెట్ లో విడుదలైన పిక్సెల్ 7a ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. సూపర్ కెమెరా కలిగిన ఈ పిక్సెల్ బడ్జెట్ ఫోన్ ఇప్పుడు మంచి డీసెంట్ ధరకే అందుకోవచ్చు.
Surveyగూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ రూ. 39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ రూ. 31,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ గూగుల్ ఫోన్ ను కేవలం రూ. 28,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
Also Read: Google Pixel 9a లాంచ్ అయ్యింది.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ Google Tensor G2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా సెక్యూరిటీ కోసం ప్రత్యేకమైన Titan M2 కో ప్రోసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ ఆక్టువ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ మరియు HDR సపోర్ట్ ను కలిగి ఉంటుంది.

ఈ గూగుల్ ఫోన్ వెనుతికె 64MP ప్రధాన కెమెరా మరియు 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగి డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ కెమెరా ఫిల్టర్లు మరియు ఎడిటింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4300 mAh బ్యాటరీ ఉంటుంది మరియు వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.