Google Pixel 6a పైన బిగ్ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Google Pixel 6a పైన బిగ్ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్

ఫ్లిప్ కార్ట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది

అతి తక్కువ EMI తో కూడా ఈ ఫోన్ ను మీరు కొనుగోలు చేయవచ్చు

Google Pixel 6a పైన బిగ్ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్. గూగుల్ లేటెస్ట్ ఫోన్స్ లాంచ్ తరువాత గూగుల్ ఓల్డ్ ఫోన్స్ ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఇటీవల వచ్చిన Google Pixel 6a మాత్రం చాలా కాలంగా 30 వేల రూపాయల వద్దనే కనిపిస్తోంది. వాస్తవానికి, ప్రారంభం గూగుల్ పిక్సెల్ 6a కూడా 40 వేల రూపాయల వద్ద లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ముందెన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తోంది. 

Google Pixel 6a: అఫర్ ధర

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుండి రూ.28,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ నుండి SBI క్రెడిట్ కార్డ్ మరియు HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారు 1,000 రూపాయల్ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందుతారు. 

అంటే, బ్యాంక్ అఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ.27,999 రూపాయల ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ను డెబిట్/ఫ్లిప్ కార్ట్ EMI ద్వారా అతి తక్కువ EMI తో కూడా ఈ ఫోన్ ను మీరు కొనుగోలు చేయవచ్చు.      

Google Pixel 6a: ప్రత్యేకతలు

గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 5G రెడీ స్మార్ట్ ఫోన్ మరియు Google Tensor ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజ్ లను కలిగి వుంది. ఈ ఫోన్ 6.14 ఇంచ్ డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కెమేరా ప్రత్యేకమైన ఫోన్లని చెప్పవల్సిన అవసరం లేదు. 

పిక్సెల్ 6ఎ ఫోన్ డ్యూయల్ రియర్ కెమేరా తో వస్తుంది. ఇందులో, 12.2MP+12MP కెమేరాలను కలిగి వుంది మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కూడా వుంది. ఈ ఫోన్ తో మీరు 4K వీడియోలను 30/60 fps వద్ద రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ 4410 mAh బ్యాటరీతో వస్తుంది మరియు Android 12OS పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :