Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో ప్రీ ఆర్డర్ లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ఈ పికెల్స్ 6a యొక్క ధర, సేల్ మరియు ప్రీ – బుక్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ 6a జూలై 28 నుండి Flipkart కి సేల్ కి వస్తుంది. ఆలశ్యం చెయ్యకుండా గూగుల్ పిక్సెల్ 6a పూర్తి వివరాల్లోకి వెళదామా.
Survey
✅ Thank you for completing the survey!
Google Pixel 6a: ధర మరియు ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 6a ఇండియా వేరియంట్ ను రూ.39,999 (MRP రూ.43,999) ధర ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ 6a జూలై 28 నుంచి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది. ఇక లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే, Axis బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 4,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, అన్ని పిక్సెల్ ఫోన్ ఎక్స్చేంజ్ పైన 6,000 రూపాయల డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది. అలాగే, 3 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.
గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.
Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది.