గూగుల్ పిక్సెల్ 6a పైన కస్టమర్ గరం .. ఎందుకంటే..!!

గూగుల్ పిక్సెల్ 6a  పైన కస్టమర్ గరం .. ఎందుకంటే..!!
HIGHLIGHTS

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 6a

గూగుల్ పిక్సెల్ 6a పైన కస్టమర్ గరం

అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి రిపోర్ట్స్

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 6a. ఇటీవలే ఇండియాలో విడుదలైన గూగుల్ పిక్సెల్ 6a ను ఉపయోగించిన ఒక కస్టమర్ ఈ ఫోన్ పైన గరం అయ్యారు. ఎందుకంటే, గూగుల్ పిక్సెల్ 6a లో కొన్ని సమస్యలు ఉన్నట్లు గమనించారు. Pixel 6aని ఎవరి వేలిముద్రతో అయినా అన్‌లాక్ చేయవచ్చని ఆయన ఫిర్యాదు చేశారు. వాస్తవానికి, ఈ సమస్యని ఎదుర్కొంటున్నట్లు మరికొంత మంది యూజర్లు కూడా రిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

రిపోర్ట్ చేసిన యూజర్లు  Google Pixel 6a ని రిజిష్టర్ చెయ్యని వారి వేలిముద్రతో కూడా అన్‌లాక్ చేయచ్చని గుర్తించారు. ఇది వినియోగదారుల ప్రైవసీ మరియు సెక్యూరిటీలకు ముప్పు కలిగిస్తుంది. ఇది ఆ యూజర్లను ఆశ్చర్యపరిచింది మరియు ఆందోళనకు కూడా గురిచేసినట్లు వారు చెబుతున్నారు.

గత వారం ఈ విషయం గురించి 9TO5 తెలిపిన ప్రకారం, గూగుల్ పిక్సెల్ 6a లో ఉన్న అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి రెండు రిపోర్ట్స్ వచ్చాయి. ఇందులో, రిపోర్ట్ చేసిన వారు ఈ ఫోన్ ముందుగా రిజిష్టర్ చేసుకొని వారు కూడా ఫోన్ ను అన్‌లాక్ చెయ్యడానికి అనుమతిస్తుందని తెలిపారు. ఈ విధమైన సమస్యను ఎదుర్కొన్నట్లు ఆరుగురు యూజర్లు రిపోర్ట్ చేసినట్లు కూడా ఈ నివేదిక తెలిపింది.

అయితే, యాడ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళా తిరిగిన స్కాన్ చేసిన తరువాత అటువంటి సమస్య రాలేదని ఒక కస్టమర్ తెలిపినట్లు ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో, Pixel 6a తో ఇటువంటి సమస్యలను ఎక్కువ మంది కొనుగోలుదారులు చూడలేదని కూడా ఈ నివేదికలో చెప్పబడింది. అలాగే, కొత్త అప్‌డేట్ ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక నివేదిక పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo