Google Pixel 11 Pro model design and pixel 11 series Pre-Order date also revealed
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి గూగుల్ కొత్త అప్డేట్ అందించింది. Google Pixel 11 Pro మోడల్ డిజైన్ మరియు పిక్సెల్ 11 సిరీస్ Pre-Order డేట్ కూడా అనౌన్స్ చేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లకు ఒక ప్రత్యేకమైన స్థానం మరియు ఫ్యాన్ బేస్ ఉంది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్ వాటి కెమెరా మరియు సెక్యూరిటీ ఫీచర్స్ తో చాలా కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పిక్సెల్ 11 సిరీస్ ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఇప్పుడు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్ లో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
గూగుల్ ఈరోజు కొత్త టీజర్ ను గూగుల్ స్టోర్ నుంచి రిలీజ్ చేసింది. ఈ కొత్త టీజర్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 12న లాంచ్ అవుతుంది మరియు అదే రోజు నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయి. అంతేకాదు, ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయబోతున్న గూగుల్ పిక్సెల్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ ను కూడా రిలీజ్ చేసింది.
గూగుల్ పిక్సెల్ 11 ప్రో మోడల్ టీజర్ ను గూగుల్ కొత్తగా విడుదల చేసింది., ఇందులో, ఈ ఫోన్ చాలా ప్రీమియం డిజైన్ మరియు బంగారు వర్ణంలో ధగధగా మెరిసిపోతోంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద వెడల్పైన కెమెరా బంప్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో ట్రిపుల్ రియర్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ ఫోన్ కెమెరా బంప్ ఫోన్ పై భాగంలో పూర్తిగా పరుచుకున్నట్టు ఇమేజ్ లో కనిపిస్తోంది.
ఇక ఫోన్ ముందు భాగానికి వస్తే, ఇందులో చాలా సన్నని బెజెల్స్ కలిగిన డిస్ప్లే ఉన్నట్లు టీజర్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ ఇప్పటికే ఇండియాలో కూడా మీడియా ఆహ్వానాలను పంపించింది. ఈ ఫోన్ న్యూయార్క్ లో గూగుల్ నిర్వహించే ‘Made by Google’ ఈవెంట్ నుంచి లాంచ్ చేస్తుంది.
Also Read: Big Deal: శాంసంగ్ Dolby Atmos సౌండ్ బార్ 10 వేల డిస్కౌంట్ తో 13 వేలకే లభిస్తోంది.!
ఈ అప్ కేమయింగ్ గూగుల్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ ను ఇప్పటికే మార్కెట్ వర్గాలు నెట్టింట్లో వెల్లడించాయి. ఈ ఫోన్ పై ఇప్పటివరకు వచ్చిన లీక్స్ మరియు రూమర్స్ ద్వారా ఈ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G6 చిప్ సెట్ తో లాంచ్ కావచ్చని అంచనా ఇస్తున్నారు. ఈ ఫోన్ లో 6.3 అంగుళాల LTPO OLED స్క్రీన్ ఉండచ్చని మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు గొప్ప బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ కెమెరా గురించి కూడా అంచనా వేసి చెబుతున్నారు. అదేమిటంటే, ఈ ఫోన్ ను 50MP ప్రధాన కెమెరా జతగా మెరుగైన అల్ట్రా వైడ్ మరియు Telephoto సెన్సర్లు కూడా కలిగి ఉంటుందని అంచనా. అయితే, ఈసారి గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్ లను 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో అందించే అవకాశం ఉందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి.
లీక్స్ మరియు అంచనా ఫీచర్స్ లో ఎన్ని ఫీచర్స్ నిజం అవుతాయో ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక్కడ అందించిన వివరాలు అంచనా మరియు లీక్డ్ ఫీచర్స్ మాత్రమే అని గమనించాలి.