flipkart SASA LELE Deal revealed on google pixel 10 phone
SASA LELE Deal: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ బిగ్ సేల్ మే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, ఈ సేల్ అర్లీ యాక్సెస్ రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బ్లాక్ మరియు ప్లస్ యూజర్లకు లభిస్తుంది. అంటే, ఈ సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్లస్ అండ్ బ్లాక్ యూజర్లకు స్టార్ట్ అవుతుంది. అయితే, ఈ సేల్ స్టార్ట్ కావడానికి ముందుగానే గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ను బెస్ట్ ప్రైస్ లో అందుకోవడానికి అర్లీ డీల్స్ అనౌన్స్ చేసింది.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా స్మార్ట్ ఫోన్ డీల్స్ ను అనౌన్స్ చేసింది. వీటిలో గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ పై అందించిన డీల్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 79,999 ధరతో లాంచ్ అవ్వగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 74,999 ధరకే సేల్ చేస్తోంది. అంతేకాదు, రూ. 5,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
ఫ్లిప్ కార్ట్ ఈ రెండు ఆఫర్స్ కాకుండా మరో ఆఫర్ కూడా ఈ సేల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 4,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ని అందిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 65,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అయితే, ఈ సేల్ నుంచి కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డిస్కౌంట్ కూడా లభిస్తే ఈ ఫోన్ కేవలం రూ. 59,999 రూపాయల అతి భారీ డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉంటుంది. ఇదే డీల్ ప్రైస్ ను ఫ్లిప్ కార్ట్ లిస్ట్ చేసింది.
Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మరియు అద్భుతమైన కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ,లో వెనుక ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇందులో 48MP మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు 10.8MP టెలిఫోటో కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 10.5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్, గూగుల్ ప్రత్యేకమైన కెమెరా కెమెరా ఫీచర్స్ అండ్ ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు రియల్ 4K వీడియోలు అందిస్తుంది.
ఈ ఫోన్ లో 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ ఉంటుంది. ఇది 60Hz–120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ Tensor G5 చిప్ సెట్ జతగా Titan M2 సెక్యూరిటీ చిప్ తో వస్తుంది. ఇది 3nm చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 4970 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జ్ మరియు Qi2 వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.