ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ : స్మార్ట్ ఫోన్ రేట్ల వెల్లడి

HIGHLIGHTS

ఈ సేల్ జనవరి 20 నుండి 22 వరకు జరగనుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ తో పోటీ పడటానికి ఫ్లిప్ కార్ట్ కూడా రిపబ్లిక్ డే సేల్ తో, అన్నింటిని సెట్ చేసుకుంది. ఈ రెండు సేల్స్ కూడా జనవరి 20 న ప్రారంభవవుతాయి.  ఈ e-కామర్స్ వెబ్సైట్ కూడా SBI  బ్యాంకుతో కలిసి పనిచేయనుంది మరియు బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లించే వారి యొక్క కొనుగోలుదారులకు 10% తక్షణ డిస్కౌంటును  అందిస్తారు. మొదటిరోజు సేల్ సమయంలో, ప్రతి 8 గంటలకొకసారి బ్లాక్ బాస్టర్ డీల్స్ తీసుకువస్తుంది  మరియు  అధికమైన డిస్కౌంట్లను అందుకునే వీలుంటుంది. వినియోగదారులు, ఈ సేల్ మొదటి రోజు మాత్రమే ఎంచుకున్న ఉత్పత్తులపై అదనపు తగ్గింపు పొందుతారు, అదికూడా 2 AM వరకు మాత్రమే. అంతేకాకుండా, సేల్ సమయంలో 1,450 రూపాయలకు పైగా షాపింగ్ చేసే వారు అదనంగా 10% డిస్కౌంట్ పొందుతారు. ఇప్పటివరకూ, ఈ ప్లాట్ఫారం పైన వెల్లడించిన డీల్స్ చూద్దాం.

శామ్సంగ్ గెలాక్సీ S8

శామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ డివైజ్ అయినటువంటి గెలాక్సీ ఎస్ 8, రూ. 30,990 రాయితీ ధర వద్ద అందించనుంది. ఈ ఫోన్ 5.8 అంగుళాల సూపర్ AMOLED క్వాడ్ HD + డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది ఒక Exynos 8895 ఆక్టా -కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంది.

రియల్మీ C1

క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసరుతో లభించే, రియల్మీ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ "సి 1" ధర రూ .6,999 అవుతుంది. ఈ ఫోన్ ఒక 6.2-అంగుళాల నొచ్ డిస్ప్లే మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరాతో వస్తుంది.

షావోమి Poco F1

గత సంవత్సరంలో, షావోమి యొక్క "Poco  F1"  మధ్య శ్రేణి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో ఒకటిగా వుంది.  ఇప్పుడు ఈ ఫోన్ కూడా రాయితీ ధర వద్ద అందుబాటులో ఉంటుంది, దాని 6GB / 64GB వేరియంట్  రూ. 18,999 ధరతో ఉంటుంది.  ప్రీపెయిడ్ మోడ్ ద్వారా చెల్లింపులను చేసే కొనుగోలుదారులు అదనపు తగ్గింపు కూడా  పొందవచ్చు.

రియల్మీ 2 ప్రో

ఈ RealMe 2 ప్రో 16MP సెల్ఫీ-కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసరుతో వస్తుంది. ఇది డిస్ప్లే పైన ఒక డ్యూ-డ్రాప్ నోచ్ ని కూడా కలిగివుంది. రూ .12,999 రాయితీ ధర వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మోటరోలా వన్ పవర్

Motorola One Power అనేది గూగుల్ యొక్క Android One ప్రోగ్రాములో భాగంగా ఉంది, అంటే దీనర్థం ఈ ఫోన్ Google నుండి ఇతర డివైజ్ల కంటే ముందుగానే అప్డేట్  పొందుతుంది. ఈ సేల్ పరిధిలో, మీరు రూ .13,999 ధరతో  ఈ ఫోన్ కొనుగోలుచేయవచ్చు.

అంతేకాక, మీరు Oppo F9 Pro , వివో V11, మరియు వివో V11 ప్రో వంటి స్మార్ట్ ఫోన్ల పైన ఎక్స్ఛేంజీతో 3,000 రూపాయల వరకు పొందవచ్చు. హానర్ 10 లైట్ కూడా మొదటిసారిగా, ఫ్లిప్ కార్ట్ ద్వారా జనవరి 20 న సేల్ కి ఉండనుంది మరియు రూ. 13,999 ధరతో అందుబాటులో ఉంటుంది.

అఫర్ వివరాల కోసం ఇక్కడ నొక్కండి.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :