Flipkart ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన Moto Days Sale ను ప్రకటించింది. జనవరి 21 నుండి మొదలైన ఈ సేల్ ఈరోజుతో ముగుస్తుండగా, మోటో ఫోన్ల పైన భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర వివరాలను కూడా అందిస్తోంది. అయితే, ఈ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో చాలా చవక ధరకే లభిస్తున్న బెస్ట్ డీల్ మాత్రం Moto e40 స్మార్ట్ ఫోన్ డీల్. మరి ఈరోజు మోటో డేస్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Moto e40: ధర మరియు అఫర్
Moto e40 స్మార్ట్ ఫోన్ ముందుగా ధర Rs.9,499 ధరతో లాంచ్ అవ్వగా, ఈరోజు మోటో డేస్ సేల్ నుండి 1,500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను Fedral బ్యాంక్ క్రెడిట్/డెబిట్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
మోటోరోలా Moto e40 పెద్ద 6.5 ఇంచ్ HD డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు పొడవుగా 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T700 ఆక్టా కోర్ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో అందించబడింది.
ఇక కెమెరా పరంగా, Moto e40 ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 48MP ప్రధాన కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ను కూడా ఇచ్చింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile