Flipkart సేల్ నుండి Realme 9i పైన భారీ డీల్స్

HIGHLIGHTS

Flipkart Month-End మొబైల్ ఫెస్ట్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ అఫర్లు

ఈ సేల్ నుండి Realme 9i పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది

రియల్ మీ 9i ఫోన్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు

Flipkart సేల్ నుండి Realme 9i పైన భారీ డీల్స్

Flipkart Month-End మొబైల్ ఫెస్ట్ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన భారీ అఫార్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి ఇటీవల రియల్ మి ఇండియాలో ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 9i పైన మంచి ఆఫర్లను అందించింది. బడ్జెట్ ధరలో 5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో వచ్చిన ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 9i: ధర మరియు ఆఫర్లు

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర రూ. 13,999 మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 గా నిర్ణయించింది. అయితే , ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి UPI పేమెంట్ చెస్ వారికీ రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Yes బ్యాంక్ మరియు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి 1,000 వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్  పైన అధిక మొత్తంలో ఎక్స్ చేంజ్ ఆఫర్ ను అందించింది. Check Offer Here        

Realme 9i: స్పెక్స్

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. అంటే, ఈ Realme ఫోన్ 11GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 128GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo