Flipkart మొబైల్స్ బొనాంజా సేల్: రూ.5,999 కే బిగ్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

Flipkart ఈరోజు నుండి Mobile Bonanza Sale సేల్ ప్రకటించింది

ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను అందించింది

6 వేల బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్: రూ.5,999 కే బిగ్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్

Flipkart ఈరోజు నుండి Mobile Bonanza Sale సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుండి చాలా  స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను అందించింది. అయితే, కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లో పెద్ద డిస్ప్లే,డ్యూయల్ కెమెరా మరియు మరిన్ని ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోరుకునేవారికి మంచి అఫర్ అందుబాటులో ఉంచింది. అదే, Gionee Max స్మార్ట్ ఫోన్ ఆఫర్ మరియు ఈ ఫోన్ ఈ సేల్ నుండి కేవలం రూ.5,999 రూపాయల ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gionee Max: ధర (Buy From Here)

జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్‌ తో తో ఉంటుంది మరియు ఈ సేల్ నుండి రూ .5,999 ధరతో లభిస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి మూడు రంగులలో లభిస్తుంది.

Gionee Max: Specs

ఈ జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఉంది, దీనికి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc 9863A SoC తో వస్తుంది మరియు 2GB RAM తో జత చేయబడింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అందించబడింది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

జియోనీ మాక్స్ 32 జిబి స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని మైక్రో ఎస్డి కార్డ్ నుండి 256 జిబి వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది రివర్స్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, జియోనీ మాక్స్ 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్‌ను కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo