Goat Sale నుంచి iPhone బిగ్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. ఐఫోన్ ప్రియులకు పండగే.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ బిగ్ సేల్ ‘Goat Sale’ ముందస్తు బిగ్ డీల్స్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుంచి అందించనున్న iPhone బిగ్ డీల్స్ ఈరోజు రివీల్ చేసింది

యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు గుడ్ న్యూస్

Goat Sale నుంచి iPhone బిగ్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. ఐఫోన్ ప్రియులకు పండగే.!

ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ బిగ్ సేల్ ‘Goat Sale’ ముందస్తు బిగ్ డీల్స్ ను అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఈ సేల్ నుంచి అందించనున్న iPhone బిగ్ డీల్స్ ఈరోజు రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి అందించనున్న ఐఫోన్ ఆఫర్ ప్రైస్ చూస్తుంటే, ఐఫోన్ ప్రియులకు పండగే అవుతుంది. ఎందుకంటే, యాపిల్ ఐఫోన్ సిరీస్ ఫోన్లు సైతం చాలా గొప్ప డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ టీజర్ లో చూపించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Goat Sale : డీల్స్

ఫ్లిప్ కార్ట్ GOAT Sale సందర్భంగా యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ అందించింది. ఈ మెగా సేల్‌ లో పలు ఐఫోన్ మోడళ్లపై ఆకర్షణీయమైన ధరలు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉండగా, ఇప్పటి నుంచే ఫ్లిప్ కార్ట్ ప్రధాన డీల్స్ మరియు ఆఫర్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ప్రారంభించింది.

Goat Sale : iPhone డీల్స్

ఇక ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసిన అప్ ఐఫోన్ డీల్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ మరియు ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ లను మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఆఫర్ ప్రైస్ తెలిపే ప్రత్యేకమైన సేల్ లిస్ట్ ను కూడా అందించింది.

Goat Sale iphone deals

ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీ లో వెల్లడైన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 ఫోన్ ను రూ. 59,900 ప్రారంభ ధరలో అందుకోవచ్చని తెలుస్తోంది.అలాగే, ఐఫోన్ 17e ఫోన్ ను రూ. 60,900 ధరలో, ఐఫోన్ 17 ఫోన్ ను రూ. 70,900 ఆఫర్ ధరలో, ఐఫోన్ 17 ప్రో ఫోన్ ను రూ. 1,12,900 ధరలో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ ను రూ. 1,27,900 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంచుతుందని తెలుస్తోంది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఎక్స్చేంజ్ ద్వారా రూ. 1,000 వరకు అదనపు తగ్గింపు కూడా లభించే అవకాశం ఉంది.

Also Read: Prime Day అండ్ GOAT Sale నుంచి ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంది.!

ఇవి కాకుండా ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో అదనపు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్స్, నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ బోనస్‌లు, పరిమిత కాల ఫ్లాష్ డీల్స్ వంటి అదనపు డీల్స్ అండ్ ఆఫర్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

తక్కువ ధరలో శక్తివంతమైన ఐఫోన్ కావాలనుకునే వారికి ఐఫోన్ 16 తగిన ఫోన్ అవుతుంది. న్యూ జనరేషన్ ఫీచర్లతో కూడిన యాపిల్ కోరుకునే వారికి ఐఫోన్ 17, అత్యుత్తమ కెమెరాఆ అండ్ పెర్ఫార్మెన్స్ జతగా ప్రీమియం అనుభవం కోరుకునే వారికి ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మంచి ఎంపికలుగా నిలుస్తాయి.

అయితే, ప్రకటించిన ధరలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ విలువ మరియు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఫ్లిప్ కార్ట్ లో లేటెస్ట్ ప్రైస్, ఆఫర్లు మరియు కండీషన్స్ తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile