Prime Day అండ్ GOAT Sale నుంచి ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంది.!

HIGHLIGHTS

Prime Day అండ్ GOAT Sale త్వరలో ప్రారంభం అవుతాయి

అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి జూలై 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కూడా జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది

Prime Day అండ్ GOAT Sale నుంచి ఈ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉంది.!

Prime Day అండ్ GOAT Sale త్వరలో ప్రారంభం అవుతాయి. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం మాత్రమే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను అందించగా, ఫ్లిప్ కార్ట్ మాత్రం అందరి కోసం ఈ సేల్ అందించింది. అయితే, ఈ రెండు సేల్స్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. అంటే, ఆన్‌ లైన్ షాపింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన సమయం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Prime Day అండ్ GOAT Sale

ఈ రెండు మెగా సేల్ ఈవెంట్ నుంచి టీవీలు, ల్యాప్‌ టాప్‌ లు, స్మార్ట్‌ ఫోన్లతో పాటు సౌండ్‌ బార్‌ లపై కూడా భారీ డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 4 నుంచి జూలై 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కూడా జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కానీ, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ సబ్ స్కైబర్స్ కి మాత్రం జూలై 3వ తేదీ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది.

ఈ రెండు సేల్స్‌ నుంచి boAt, Zebronics, Sony, Samsung, JBL, LG, GOVO, Mivi వంటి ప్రముఖ బ్రాండ్ల సౌండ్‌ బార్‌ లపై 20% నుంచి 50% వరకు ధర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ విభాగంలో బోట్ Aavante, జెబ్రోనిక్స్ Juke Bar, గోవో Go Surround, మివి Fort మోడల్స్ సౌండ్ బార్స్ ఆకర్షణీయమైన ధరలో లభించే అవకాశం ఉంది.

Prime Day and GOAT Sale soundbar deals

ప్రీమియం విభాగంలో సోనీ HT-S20R, శాంసంగ్ B-Series, LG S40T, JBL Cinema SB560 వంటి డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్. డాల్బీ అట్మోస్ లేదా 5.1 ఛానల్ సపోర్ట్ కలిగిన మోడల్స్ పైన కూడా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశముంది.

అదనంగా బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, EMI ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌ వంటి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు కొత్త సౌండ్‌ బార్ కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటే, ఈ సేల్ ప్రారంభానికి ముందే మీకు నచ్చిన మోడళ్లను ‘Wishlist‌’ లో సేవ్ చేసుకోవడం, ధరలను ముందుగానే పోల్చుకోవడం ద్వారా అత్యుత్తమ డీల్‌ను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: మీ EPFO Balance చూడలేక పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డీల్స్ మరియు ఆఫర్స్ తో ఇప్పటికే రెండు ప్లాట్ ఫామ్స్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తున్నాయి. అంతేకాదు, ఐదు పేజీ నుంచి అప్ కమింగ్ డీల్స్ రివీల్ చేస్తున్నాయి. మీకు నచ్చిన డీల్ ను ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile