Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ : ఈ LED టీవీల పైన గరిష్టంగా 60 శాతం వరకూ డిస్కౌంట్

HIGHLIGHTS

ఈ సెల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు నడుస్తుంది.

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ : ఈ LED టీవీల పైన గరిష్టంగా 60 శాతం వరకూ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2019 ఈరోజు నుండి ప్రారంభమైంది మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యొక్క ఈ అతిపెద్ద సేల్ నుండి ఈ రోజు మీరు చాలాకాలంగా కొనాలనుకుని ఎదురుస్తున్న అనేక ఉత్పత్తులపై గొప్ప డీల్స్ అందుకోవచ్చు. ఈ సెల్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు నడుస్తుంది. మీరు కనుక ఒక క్రొత్త టెలివిజన్‌ను కొనాలని ఆలోచిస్తుంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఒక గొప్ప సదవకాశంగా ఉంటుంది. ఈ సేల్ సమయంలో, అనేక క్రెడిట్ కార్డుల పైన అదనపు డిస్కౌంట్  కూడా అందుకోవచ్చు మరియు క్యాష్‌బ్యాక్‌లు కూడా ఇవ్వబడుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Thomson (40 inch) Ultra HD (4K) LED Smart TV 

MRP : రూ .27,999

పండుగ సేల్ ధర: రూ .18,499

థామ్సన్ నుండి వచ్చిన ఈ టీవీని ఈ రోజు రూ .18,499 ధరకు విక్రయిస్తున్నారు. ఈ టీవీ యొక్క స్క్రీన్ పరిమాణం 40 అంగుళాలు మరియు ఇది 4K రిజల్యూషన్ స్మార్ట్ టీవీ, ఈ ధరలో ఇది ప్రత్యేకమైనది. మీరు ICICI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Micromax 102cm (40 inch) Full HD LED TV 

MRP: రూ .39,990

పండుగ సేల్ ధర: రూ .13,999

ఈ మైక్రోమాక్స్ టీవీ ఏకంగా 64% తగ్గింపుతో కేవలం రూ.13,999 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ టీవీని No Cost EMI ద్వారా నెలకు కేవలం 1,167 రూపాయలు చెలించే విధంగా కూడా కొనవచ్చు.

Mi LED Smart TV 4A Pro (43)

MRP: రూ .25,999

పండుగ సేల్ ధర: రూ .19,999

షావోమి యొక్క ఈ ఆండ్రాయిడ్ టీవీ కేవలం రూ .19,999 కు మాత్రమే లభిస్తుంది మరియు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే, మీరు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

MarQ by Flipkart Full HD LED Smart Android TV

MRP: రూ .41,999

పండుగ సేల్ ధర: రూ .19,999

ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ .19,999 ధర వద్ద లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి అదనంగా 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ టీవీలో 43 అంగుళాల ఎల్‌ఈడీ ప్యానెల్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile