iPhone 17
SASA LELE సేల్ సేల్ ఈరోజు ముగుస్తుంది మరియు చివరి సమయంలో ఈ సేల్ నుంచి iPhone 17 పై ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా అందించిన ఈ సేల్ నుంచి అందించిన డీల్స్ లో ఈ ఐఫోన్ ఈరోజు బెస్ట్ డీల్ గా నిలుస్తుంది.ఈ రోజు అర్ధరాత్రి తో సేల్ ముగుస్తుంది కాబట్టి, ఈ సేల్ ముగిసే లోపు ఈ డీల్ ను అందుకోవాల్సి ఉంటుంది.
ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ రూ. 82,900 ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఇదే ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోను పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ఈరోజు ప్రకటించింది. మొదటి ఆఫర్ ఐఫోన్ 17 పై రూ. 5,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. రెండోది ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ మరియు ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 6,995 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 70,905 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: సేల్ చివరి రోజు కేవలం రూ. 3,606 రేటుకే 300W Dolby సౌండ్ బార్ చేస్తున్న అమెజాన్.!
6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే తో వస్తుంది ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్. ఈ స్క్రీన్, డైనమిక్ ఐలాండ్, 120Hz ప్రో మోషన్ రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ యాపిల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ సరికొత్తగా అందించిన A19 chip తో పని చేస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ అందించిన లేటెస్ట్ iOS 26 సాఫ్ట్ వేర్ పై నడుస్తుంది. డిజైన్ పరంగా, చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా దృఢంగా ఉంటుంది.
ఈ యాపిల్ లేటెస్ట్ ఫోన్ 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 18MP సెల్ఫీ కెమెరా కూడా ఆఫర్ చేసింది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది Dolby Vision మరియు 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం వీడియో రికార్డింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, యాపిల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.