Meta AI Muse now got active trending search in India know why
ఫేస్ బుక్ యాజమాన్య కంపెనీ Meta AI Muse ని ప్రకటించింది. ఈ కొత్త ఏఐ మోడల్ గురించి వివరంగా తెలుసుకోవడానికి మరియు ఈ మోడల్ ని ఉపయోగించడానికి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు. అందుకే, గూగుల్ లో ఈ మోడల్ కోసం వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంత గణనీయంగా పెరిగిందంటే, సాధార లెవల్ తో పోలిస్తే ఏకంగా 500% పెరిగినట్లు గూగుల్ ట్రెండ్స్ చెబుతోంది.
మెటా తీసుకొచ్చిన కొత్త పర్సనల్ AI ఏజెంట్ మెటా మ్యూజ్ మరియు ఇది సాధారణ Chat GPT తరహా చాట్ బోట్ మాదిరిగా కాకుండా దానికి చెప్పిన పని పూర్తి చేయడానికి దాన్ని స్వయంగా ప్లాన్ చేసి, వెబ్ సైట్లలోకి వెళ్లి, ఫామ్ నింపడం,అపాయింట్మెంట్ లేదా బుకింగ్ చేయడం, ఇమెయిల్ లేదా క్యాలెండర్ వంటి సర్వీస్ తో పని చేయడం వంటి పనులు మీ తరపున పూర్తి చేయడానికి ఇది రూపొందించబడింది.
అంటే, ఈ కొత్త ఏఐ మోడల్ మీకు శ్రమ లేకుండా మీ మొత్తం ప్లానింగ్ తో పాటు దానికి అవసరమైన సైట్ లను కూడా వెతికి అన్ని రెడీ చేసి మీ ముందు ఉంచుతుంది. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్ అని మెటా ఈ ఏఐ మోడల్ గురించి పొగుడుతోంది.
ఇది మెటా కొత్తగా రిలీజ్ చేసిన అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ మరియు దీనిని యూజర్ కోసం ‘పర్సనల్ ఏఐ ఏజెంట్’ గా పని చేస్తుంది. అంటే, మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న Chat GPT చాట్ బోట్ మాదిరిగా కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయడం లేదా వివరాలు అందించడం మాత్రమే చేయదు. ఇది మీరు అడిగిన పనిని పూర్తి చేయడానికి అన్ని సిద్ధం చేసి మీకు రిజల్ట్ అందిస్తుంది.
దీని గురించి ఉదాహరణలతో చెప్పాలంటే, సపోజ్ మీరు హైదరాబాద్ లో ఒక మంచి హోటల్ కోసం వేయడానికి ఈ కొత్త ఏఐ ఏజెంట్ కి పని అప్పజెబితే, ఇది మీ బడ్జెట్ మరియు డేట్స్ తెలుసుకుని హోటల్స్ ని సెర్చ్ చేసి, వాటిలో బెస్ట్ ఆప్షన్ ని కంపేర్ చేసి చేసి, మీరు అప్రూవ్ చేస్తే booking ప్రాసెస్ ని కూడా పూర్తి చేస్తుంది. అంటే, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏఐ మోడల్ కాదని చెప్పిన పనిని పూర్తి చేసే పర్సనల్ ఏఐ ఏజెంట్. ఈ కొత్త మోడల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది “చెప్పే AI” కాదు “పని చేసే AI” అని సింపుల్ గా చెప్పవచ్చు.
ఈ లేటెస్ట్ ఏఐ మోడల్ ఇండియాలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే, త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మోడల్ ని మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడి తో సైన్ అప్ చేసుకొని లాగిన్ చేయాలి.
Also Read: Ai+ Nova Tab: బడ్జెట్ ధరలో 5G ట్యాబ్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.!
అవును, ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో “Muse from Meta” అనే పేరుతో ఉంది. ఈ యాప్ Description లో ఇమెయిల్, బుకింగ్స్, బడ్జెట్, డీల్స్, కనెక్టెడ్ యాప్స్ వంటి ఫీచర్స్ వివరించబడ్డాయి.