Exclusive: వన్ ప్లస్ నార్డ్ 2T Dimensity 1300 SoC, 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది

Exclusive: వన్ ప్లస్ నార్డ్ 2T Dimensity 1300 SoC, 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది
HIGHLIGHTS

Oneplus Nord 2T లేటెస్ట్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్ తో వస్తుంది

Nord 2T 90Hz రిఫ్రెష్ రేట్‌ AMOLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది

వన్ ప్లస్నార్డ్ 2T వెనుక భాగంలో 50MP + 8MP+2MP కెమెరా సెటప్ తో వస్తుంది

OnePlus నుండి రానున్న అప్ కమింగ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గా వన్ ప్లస్ నార్డ్ 2T స్మార్ట్ ఫోన్ నిలుస్తుంది మరియు ఇది Nord 2 యొక్క తరువాతి తరం ఫోన్ గా ఉంటుంది. ఒరిజినల్ Nord 2020లో ప్రారంభించబడినప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యింది మరియు OnePlus తదుపరి సంవత్సరంలో Nord CE మరియు Nord 2 స్మార్ట్ ఫోన్లతో దానిని రెట్టింపు చేసింది. ఇప్పుడు, ఊహించినట్లుగానే OnePlus Nord 2T అతి త్వరలో భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది మరియు ఈ రోజు మేము ఆ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌ లను మీతో పంచుకుంటున్నాము.

Oneplus Nord 2T vs OnePlus Nord 2

OnLeaks ప్రకారం, నార్డ్ 2T FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు డైమెన్సిటీ 1300 చిప్‌సెట్ యొక్క శక్తితో పనిచేస్తుంది. డైమెన్సిటీ 1300 ఇంకా అధికారికంగా లేదు, అయితే MediaTek యొక్క ట్రాక్ రికార్డ్‌ను బట్టి మీరు 6nm డైమెన్సిటీ 1200 చిప్ సెట్ కంటే పనితీరులో మరింత ఆశించవచ్చు. డిస్ప్లేకొలతలను బట్టి Nord 2 మాదిరిగా Nord 2T ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, Nord 2T యొక్క ముఖ్యమైన కీలక అంశాలలో ఒకటి 80W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌కి మద్దతు ఇవ్వడమే. Nord 2 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో వచ్చినప్పటికీ, ఇది ఇటీవల చైనాలో ప్రారంభించబడిన OnePlus 10 Pro వరకు మాత్రమే మరియు ఇప్పుడు  OnePlus అధికారికంగా 80W వార్ప్ ఛార్జింగ్‌ను ప్రవేశపెట్టింది.

మేము కొన్ని సెన్సార్ అప్‌గ్రేడ్‌లను ఆశిస్తున్నప్పటికీ కెమెరా సెటప్ చాలావరకు నార్డ్ 2 వలెనే ఉంటుంది. OnePlus Nord 2T గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం ఇక్కడ చూడవచు.

OnePlus Nord 2T: లీక్డ్ స్పెషిఫికేషన్స్

OnePlus Nord 2T ఒక 6.43-ఇంచ్ FHD+ (2400×1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంటుంది మరియు ఇది AMOLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నోచ్ కటౌట్ కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

Nord 2T స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1300 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఇది ఎంచుకోవడానికి వీలుగా 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో పాటు 6GB/8GB/128GB RAMతో జత చేయబడుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత OxygenOS 12 లో ఫోన్ రన్ అయ్యే అవకాశం ఉంది.

వన్ ప్లస్నార్డ్ 2T వెనుక భాగంలో 50MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ముందు భాగంలో, మనం 32MP సెల్ఫీ కెమెరాను పొందుతాము. ఇక బ్యాటరీ విషయానికొస్తే, నార్డ్ 2T 80W SuperVOOC ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

భారతదేశంలో Nord 2T ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి. కానీ కొన్ని రూమర్ల ప్రకారం చూస్తే, OnePlus కంపెనీ ఫిబ్రవరిలో Nord ఫోన్‌ను ప్రారంభించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo