Exclusive: iQOO 9 Series స్పెక్స్ మరియు ధర వివరాలు విడుదల కంటే ముందే రివీల్

Exclusive: iQOO 9 Series స్పెక్స్ మరియు ధర వివరాలు విడుదల కంటే ముందే రివీల్
HIGHLIGHTS

QOO 9 Series త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది

అధికారిక లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు

iQOO 9 గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని పొందగలిగాము

iQOO 9 Series స్మార్ట్ ఫోన్లను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కానీ, iQOO 9 సిరీస్ యొక్క ఖచ్చితమైన అధికారిక లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే, IQOO ఇండియా యొక్క CEO అయిన నిపున్ మరియా, సిరీస్ ను భాఇండియాలో అతి త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ నెల ప్రారంభంలో తెలిపారు.

ఈ సిరీస్ నుండి iQOO 9 మరియు iQOO 9 Pro రెండు ఫోన్లను ఆవిష్కరిస్తుంది. ఇండియా లాంచ్‌ కంటే ముందే, ఇప్పుడు మేము పూర్తి స్పెక్ షీట్ మరియు iQOO 9 ధర గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని పొందగలిగాము.

iQOO 9: ధర

కంపెనీకి సన్నిహితమైన మా సోర్స్ తెలిపిన ప్రకారం, iQOO 9 సిరీస్ లో రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్ తో  అందించబడవు. దానికి బదులుగా, iQOO 9 లోపల స్నాప్‌డ్రాగన్ 888+ చిప్‌ని కలిగి ఉంటుంది.

iQOO 9 ధరలను మార్కెట్లో ఉన్న ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. భారతదేశంలో iQOO 9 ధర రూ. 40,000 నుండి రూ. 45,000 మధ్య ఉంటుందని మరియు OnePlus 9RT కి ప్రత్యక్ష పోటీదారుగా ఉండవచ్చని మా సోర్స్ ద్వారా తెలిసింది.

iQOO 9: స్పెక్స్

పైన పేర్కొన్న విధంగా మేయు iQOO 9 స్పెక్స్ షీట్ ను ముందుగానే పొందగలిగాము. దీని ద్వారా ఈ ఫోన్ ఇండియా వేరియంట్ యొక్క హార్డ్‌వేర్ గురించి మొత్తం సమాచారాన్ని అందిచగలుతున్నాము. 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్  కలిగిన 6.56-అంగుళాల 10-బిట్ AMOLED ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్ సెట్ తో వస్తుంది. దీనికి జతగా LPDDR5 + UFS 3.1కాన్ఫిగరేషన్ కలిగిన ర్యామ్ మరియు స్టోరేజ్ అప్షన్ లను అందిస్తుంది.

ఈ ఫోన్ Android 12 ఆధారితమైన FunTouchOs 12  స్కిన్ పైన నడుస్తుంది. ఇక పనితీరును మరింత మెరుగుపరచడానికి 4GB వర్చువల్ RAMని జోడించే విధమైన కంపెనీ యొక్క ఎక్స్‌టెండెడ్ RAM ఫీచర్‌కు కూడా ఈ ఫోన్ మద్దతునిస్తుంది.

కెమెరా విభాగంలో, 13MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 13MP 50mm ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ లెన్స్‌తో పాటు 48MP IMX 598 సెన్సార్‌తో గల రియర్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 16MP లెన్స్‌ ఉంటుంది. ఈ ఫోన్ 4,350mAh బ్యాటరీని ప్యాక్‌ చేస్తుంది  మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo