ఆండ్రాయిడ్ L అండ్ విండోస్ 10 డ్యూయల్ OS లతో Elephone స్మార్ట్ ఫోన్

ఆండ్రాయిడ్ L అండ్ విండోస్ 10 డ్యూయల్ OS లతో Elephone స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

సెప్టెంబర్ 30 న రిలీజ్ అవుతుంది. ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు.

చైనీస్ కంపెని, Elephone డ్యూయల్ os బూటింగ్ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది. దీని పేరు Elephone Vowney. ధర 19,851 రూ. సెప్టెంబర్ 30 న రిలీజ్ అవుతుంది.

డ్యూయల్ బూటింగ్ అంటే ఒక ఫోనులో రెండు os లు రన్ అవటం.  ఆండ్రాయిడ్ లలిపాప్ మరియు విండోస్ 10 మొబైల్ os లు, రెండూ ఈ ఫోన్ లో పనిచేస్తాయి. elephone వెబ్ సైట్ లో ప్రీ ఆర్డర్స్ కూడా చేసుకోగలరు.

స్పెసిఫికేషన్స్ – 5.5 in క్వాడ్ HD డిస్ప్లే, 535PPi, 3gb ర్యామ్, క్వాడ్ కోర్ ఇంటెల్ ప్రొసెసర్, 20.7MP రేర్ కెమేరా, సోనీ IMX230 డ్యూయల్ led ఫ్లాష్ సెన్సార్

4K వీడియో రికార్డింగ్, 8MP ఫ్రంట్ కెమేరా. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 mah బ్యాటరీ, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, గోల్డ్ కలర్ బాడీ డిజైన్ తో టాప్ ర్యాంజ్ మొబైల్ లా వస్తుంది. వైట్ అండ్ గ్రే కలర్స్ కూడా ఉన్నాయి.

ఇదే ఫోన్ కేవలం ఆండ్రాయిడ్ os పైనే రన్ అయ్యేలా మరో వేరియంట్ కూడా వస్తుంది. అయితే దీనిలో ఆక్టో కోర్ మీడియా టెక్ 2.2GHz ప్రొసెసర్ మరియు 3800 mah బ్యాటరీ మార్పులు ఉన్నాయి. మిగిలిన అన్నీ స్పెక్స్ సేమ్.

పేపర్ పై స్పెక్స్ చుస్తే, డ్యూయల్ బూట్ os వేరియంట్ బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ అక్టోబర్ 20 న మరొక ఫోన్,elephone p9000, 4gb ర్యామ్ అండ్ మీడియా టెక్ ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Helio X20 ప్రొసెసర్ ను 33,034 రూ లకు రిలీజ్ చేయనుంది.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo