రియల్మీ 5 ప్రో ప్రత్యేకతల గురించి తెలుసా?

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 14 Aug 2019
HIGHLIGHTS
  • రియల్మీ5 ప్రో లో 48MP సెన్సార్ ఉంటుందని ఉంటుందని నిర్ధారించింది.

రియల్మీ 5 ప్రో ప్రత్యేకతల గురించి తెలుసా?
రియల్మీ 5 ప్రో ప్రత్యేకతల గురించి తెలుసా?

ఆగస్టు 20 న న్యూ ఢిల్లీ లో జరిగనున్న ఒక కార్యక్రమంలో రియల్మీ 5 సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు రియల్మి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ,ఈ సిరీస్ ఫోన్ల కోసం  “లీప్ టు క్వాడ్ కెమెరా” ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తోంది ఎందుకంటే ఈ సిరీస్‌లోని ఫోన్‌లు నాలుగు కెమేరాలతో రానున్న రియల్మి హ్యాండ్‌సెట్‌లుగా ఉంటాయి. ఇందులోని వెనుక కెమెరాలు, శామ్సంగ్ 64 MP  ప్రాధమిక కెమెరాతో ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయితే,  ఈ ఫోన్ అదే కావచ్చని ఊహిస్తుండగా, రియల్మీ5 ప్రో ఫోన్ను ఒక ప్రధాన 48MP కలిగిన క్వాడ్ (నాలుగు) కెమేరా సెటప్పుతో తీసుకురానున్నట్లు, రియల్మీ తన ట్విట్టర్ హ్యాండీల్లో చేరిన ఒక ట్వీట్ ద్వారా అర్ధమవుతోంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రిటైల్ అవుతాయి మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఇప్పటికే ‘రియల్‌మే 5’ సిరీస్‌ యొక్క టీజర్ అందించింది.

ఈ ట్వీట్ ప్రకారం, ఈ ఫోన్‌లో ప్రాధమిక లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే,  ముందుగా రియల్మి 5 సిరీస్ ఫోన్‌లకు 64 ఎంపి సెన్సార్ ఉంటుందని అందరూ ఊహిస్తుండగా, రియల్మీ5 ప్రో లో మాత్రం 48MP తో మాత్రమే ఉంటుందని నిర్ధారించింది. అయినాసరే, ఈ ఫోన్ ఒక 48MP కెమేరాతో క్వాడ్ రియర్ కెమేరా సెటప్పు కలిగిన మొదటి ఫోనుగా ఉంటుంది.   

అయితే, రియల్మీ యొక్క 5 సిరీస్ నుండి రానున్న మరొక ఫోన్ అయినా రియల్మీ5 గురించిన సమాచారం లేదు కాబట్టి, ఒకవేళ ఈ ఫోన్ను ఒక 64MP కెమేరాతో తీసుకురావచ్చని కొంత మంది తమ అంచనాలను మరియు రూమర్లను అందిస్తున్నారు. కానీ, రియల్మీ మాత్రం దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం చెయ్యలేదు. ఆగష్టు 20 వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ ఫోన్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని విషయాలు ప్రకటించే వరకూ ఈ సస్పెన్సు కొనసాగుతుంది కావచ్చు.    

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
realme 5 pro realme 3 pro camera
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
Redmi 9 Power (Mighty Black 4GB RAM 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen | 48MP Quad Camera | Alexa Hands-Free Capable
₹ 11499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6999 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status