ONEPLUS 7 మరియు 7 Pro పూర్తి స్పెక్స్ గురించి తెలుసా ?

ONEPLUS 7 మరియు 7 Pro పూర్తి స్పెక్స్ గురించి తెలుసా ?
HIGHLIGHTS

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ కి జతగా ఒక 12GB ర్యామ్ తో వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కొత్త ట్రెండ్ మరియు మన్నికను ప్రధానాంశంగా తన స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చే వన్ ప్లస్, ఇప్పుడు కూడా అదేవిధంగా తన వన్ ప్లస్ 7 సిరీస్ ఫోన్లను పరిచయం చేయనుంది. ఇందులో, ఇప్పటి వరకు అత్యుత్తమైన ప్రాసెసర్ గా పేరుగాంచిన, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ కి జతగా ఒక 12GB ర్యామ్ తో వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో విశేషాలతో  విడుదలకానుంది.    

OnePlus 7 మరియు OnePlus 7 Pro ప్రత్యేకతలు

వన్ ప్లస్ 7 ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేతో ఉంటే, OnePlus 7 Pro ఒక 6.7 అంగుళాల కర్వ్డ్ QHD+ సూపర్ AMOLED డిస్ప్లేతో రానుంది.ఈ రెదను స్మార్ట్ ఫోన్లు కూడా ఒక స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరుతో తీసుకురావచ్చు. అయితే, వన్ ప్లస్ 7 ప్రో లో మాత్రం 5G కనెక్టవిటీ కోసం X50 మోడెమ్ తో అందించవచ్చు.

ఇక కెమేరా విభాగానికి వస్తే, OnePlus 7 Pro ఒక ట్రిపుల్ రియార్ కెమేరాతో తీసుకొస్తుంది. ఈ కెమేరా 3X జూమ్ తో రానుంది మరియు ఇందులో ఒక 48MP ప్రధాన కెమేరా f/1.6 అపర్చరుతో ఉంటుంది . దీనికి జతగా 3X జూమ్ చేయగల ఒక f/2.4 అపర్చరు గల 8MP టెలిఫోటో లెన్స్  మరియు ఒక 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా లు ఉంటాయి. ఇక OnePlus 7 విషయానికి వస్తే, ఇది f/1.7 అపర్చరు గల ఒక 48MP ప్రధాన కెమేరాకి జతగా ఒక 5MP డెప్త్ సెన్సార్ తో కూడిన డ్యూయల్ రియారా కెమేరా ఉంటుంది.

ఇక బ్యాటరీ సమర్ధయాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 7 ప్రో ఒక 4,000 mAh బ్యాటరీతో మరియు 30W Wrap ఛార్జ్ సపోర్టుతో ఉంటే, వన్ ప్లస్ 7 మాత్రం 3,600mAh బ్యాటరీతో 20W  స్పీడ్ ఛార్జ్ సపోర్టుతో వస్తాయి.      

Geekbench లో  OnePlus GM 1917 మోడల్ నంబర్ గల ఒక స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ తో దర్శనమిచ్చింది. ఇది కచ్చితంగా  వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ అయ్యివుంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ ఫోన్ గీక్ బెంచ్ పైన 3551 సింగల్ కోర్ టెస్ట్ స్కోరును మరియు 11012 మల్టీ కోర్ టెస్ట్ స్కోరును సాధించింది. అలాగే, ముందుగా వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం, ఈ వన్ ప్లస్ 7 ప్రో 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజి, 8GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి మరియు 12GB ర్యామ్ జతగా 256GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లలో కూడా రానున్నట్లు తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo