డీటెల్ D30 ‘Selfie’ ఫీచర్ ఫోన్ పరిచయం, ధర కేవలం ఇంతే …
ప్రపంచంలో అత్యంత సరసమైన ఫీచర్ ఫోన్ కంపెనీ డీటెల్ , నేడు కొత్త ఫీచర్ ఫోన్ డీటెల్ D30 లాంచ్ ప్రకటించింది. చాలా తక్కువ ధర వద్ద బెస్ట్ ప్రయోజనాల తో చాలా కొత్త ఫీచర్లు ఈ ఫోన్ కి జోడించబడ్డాయి.కేవలం 899 రూపాయలకే లభిస్తుంది, ఈ ఫోన్ మొబైల్ ఫోన్లలో అధునాతన లక్షణాలను ఉపయోగించడానికి ఆసక్తిగా ఉన్న మొబైల్ వినియోగదారుల యొక్క అవసరాలను తీర్చటానికి రూపొందించబడింది,మొట్టమొదటి హైబ్రిడ్ ఇ-డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫారమ్ B2BAdda.com లో అమ్మకానికి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చింది.
Surveyఈ ఫోన్ ఒక డిజిటల్ డ్యూయల్ (ముందు మరియు వెనుక) కెమెరా 2.4 అంగుళాల డిస్ప్లే మరియు ఫ్లాష్ లైట్ తో ఉంది. ఇది 1400 MAH పవర్ఫుల్ బ్యాటరీ యొక్క మద్దతును కలిగి ఉంది . అందంగా రూపొందించిన ఫోన్ లో ఆటో కాల్ రికార్డింగ్లు, కాల్ బ్లాక్లిస్ట్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, ఆడియో / వీడియో ప్లేయర్ మరియు నాలుగు ఇతర లైవ్ లైట్స్ వంటి ఇతర ప్రముఖ ఫీచర్లు ఉన్నాయి. స్టోరేజ్ గురించి మాట్లాడుతూ, ఈ ఫోన్ 16 జీబి స్టోరేజ్ కలిగి ఉంది.
డీటెల్ డీ 30 డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్బై ఫంక్షనాలిటికి కూడా మద్దతు ఇస్తుంది. ఇందులో GPRS, వైర్లెస్ ఎఫ్ఎమ్, గేమ్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు, ఈ ఫోన్ పై ఒక సంవత్సరం వారంటీ ఉంది .డిస్ప్లే 6.1 సెం.మీ. (2.4 '), డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్బై, డిజిటల్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా, 4 ఎల్ఈడి లైట్. బ్యాటరీ 1400 mAh, ఆటో కాల్ రికార్డు, బ్లాక్ లిస్టు, ఫ్లాష్ లైట్, 3.5 mm జాక్, ఆడియో / వీడియో ప్లేయర్, మైక్రోఎస్డీ కార్డ్స్ మద్దతు 16 GB, ఫోన్ బుక్ 1000, SMS 300, మల్టీ- లాంగ్వేజ్ సపోర్ట్ , గేమ్స్, వైర్లెస్ FM, GPRS, SOS మరియు పానిక్ బటన్, వన్ ఇయర్ వారంటీ, పవర్ సేవింగ్ మోడ్.డీటెల్ D30 అనేది ఫ్రంట్ డిజిటల్ కెమెరాను కలిగి ఉన్న మొట్టమొదటి ఫోన్.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile