Samsung Galaxy M17e 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన శామ్సంగ్.!

HIGHLIGHTS

Samsung Galaxy M17e 5G ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ఈరోజు శామ్సంగ్ రివీల్ చేసింది

యంగ్ ఇండియన్ యూజర్ల కోసం ఆల్ ఇన్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ వెల్లడించింది

లాంచ్ చేసే డేట్ మరియు ఈ ఫోన్ కలిగిన కీలక ఫీచర్లు కూడా ఈరోజు వెల్లడించింది

Samsung Galaxy M17e 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ చేసిన శామ్సంగ్.!

Samsung Galaxy M17e 5G ఇండియా లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ ఈరోజు శామ్సంగ్ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను యంగ్ ఇండియన్ యూజర్ల కోసం ఆల్ ఇన్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసే డేట్ మరియు ఈ ఫోన్ కలిగిన కీలక ఫీచర్లు కూడా ఈరోజు వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M17e 5G : లాంచ్ డేట్?

శామ్సంగ్ గెలాక్సీ ఎం 17e స్మార్ట్ ఫోన్ ను మార్చి 17వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ అనౌన్స్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ను ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో మరింత విస్తరిస్తుంది.

Samsung Galaxy M17e 5G : కీలక ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 17e స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8.2mm మందంతో స్లీక్ గా ఉంటుంది మరియు మంచి మంచి స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ తగిన ర్యామ్ మరియు బిగ్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను One UI 8.0 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా శామ్సంగ్ వెల్లడించింది.

Samsung Galaxy M17e 5G

ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 50MP మెయిన్ సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఎక్కువ సమయం బ్యాటరీ సేవ్ చేసే ఎనర్జీ సేవింగ్ మోడ్ తో కూడా ఉంటుంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ తో వస్తుంది. అంటే, ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఆటో బ్లాకర్ మరియు Samsung Knox వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అందుకే, శామ్సంగ్ ఈ ఫోన్ ను ఆల్ రౌండ్ ఫోన్ అని చెబుతోంది. శామ్సంగ్ ఇప్పటికే గెలాక్సీ ఎం 17 ఫోన్ విడుదల చేసింది కాబట్టి, ఈ ఫోన్ ను మరింత బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Poco C85x 5G: రేపు లాంచ్ అయ్యే పోకో బడ్జెట్ ఫోన్ కంప్లీట్ వివరాలు ముందే తెలుసుకోండి.!

అయితే, శామ్సంగ్ గెలాక్సీ ఎం 17 ప్రైస్ గురించి శామ్సంగ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఈ ఫోన్ ప్రైస్ గురించి మనం ఖచ్చితంగా చెప్పలేము.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo