కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ కేవలం రూ. 5,990 ధరతో ఇండియాలో విడుదలయ్యింది.

Updated on 27-Jun-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్, డ్యూ డ్రాప్ నోచ్, 13MP సింగిల్ కెమేరా మరియు మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ వంటి గొప్ప ప్రత్యేకతలతో వస్తుంది.

అతితక్కువ ధరలో మన్నికైన మరియు ట్రెండీ స్మార్ట్ ఫోన్లను అందించే సంస్థగా పేరుగాంచిన, కూల్ ప్యాడ్ తన కూల్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.5,999 ప్రారంభ దరతో ఈ రోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, డ్యూ డ్రాప్ నోచ్, 13MP సింగిల్ కెమేరా మరియు మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ వంటి గొప్ప ప్రత్యేకతలతో వస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్నుఅమేజాన్ ఇండియా ద్వారా సేల్ చేయనున్నట్లు కూడా ప్రకటుంచింది.  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జులై 2 వ తేదీన జరగనుంది.             

కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ ధరలు

కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ – 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజి వేరియంట్ – ధర Rs.5,990

కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ – 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజి వేరియంట్ – ధర Rs.6,499

కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ : ప్రత్యేకతలు

ఈ కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్  స్మార్ట్ ఫోన్, ఒక 5.71 అంగుళాల HD + డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో మరియు 19:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ బాడీతో, చెర్రీ  బ్లాక్ మరియు ఓసియన్ బ్లూ వంటి రెండు రంగుల ఎంపికలతో వస్తుంది.  ఈ ఫోన్ ఒక మీడియా టెక్ హీలియో A22 ప్రోసెసరుకు జతగా 2GB లేదా 3GB ర్యామ్ శక్తితో వస్తుంది మరియు 16GB లేదా 32GB స్టోరేజి తో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఇందులో  కేవలం ఒకే ఒక్క 13MP కెమేరాని అందించింది. అలాగే, సెల్ఫీ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. అధనంగా, ఇది ఒక  3,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా, 4G LTE, wi-fi మరియు బ్లూటూత్ 5.0 వంటి మరిన్ని విశేషాలతో వస్తుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :