Price Cut: హానర్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ HONOR 200 5G పై ఇప్పుడు తగ్గింపు ప్రకటించింది. ఇండియాలో 35 వేల రూపాయల ఉప బడ్జెట్ లో విడుదలైన ఈ 5జి ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపు అందుకొని 30 వేల బడ్జెట్ లో లభిస్తోంది. ఈ ఫోన్ అలాగే, అమెజాన్ ఇండియా నుంచి ఈ ఫోన్ పైన అందించిన బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మరింత చవక ధరకు అందుకునే ఛాన్స్ కూడా వుంది. ఈ హానర్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన అందించిన అన్ని ఆఫర్లు మరియు ఆఫర్ ప్రైస్ వివరాలు తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
HONOR 200 5G Price Cut
ఇండియాలో రూ. 34,999 రూపాయల ధరలో విడుదలైన హానర్ 200 5జి ఫోన్ ఇప్పుడు రూ. 8,000 పైగా తగ్గింపు అందుకొని రూ. 26,998 ఆఫర్ ధరకే అమెజాన్ ఇండియా నుంచి లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం చూడలేదు. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 1,215 రూపాయల EMI ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ ను కూడా అమెజాన్ ఇండియా అందించింది. Buy From Here
హానర్ 200 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Curved AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు DCI P3 సపోర్టుతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP + 50MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 5200mAh సెకండ్ జెన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.