సాధారణంగా ఈ మధ్యకాలంలో కెమేరా ఫోన్ల పైన అందరికి కూడా మక్కువ పెరిగినట్లు చెప్పొచ్చు. దేనికి అనుగుణంగా, అన్ని మొబైల్ తయారీ సంస్థలు కూడా వారి అందిచే ఫోన్లలో ఒకరికి మించి మరొకరు అందిస్తున్న కెమేరా ఫీచర్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొకోవచ్చు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో లబిస్తున్న బెస్ట్ కెమెరాలలో టాప్ 5 ఫోన్లను గురించి తెలుకుందాం.
ఈ హువావే P30 స్మార్ట్ ఫోతో కూడా DSLR క్వాలిటీలో ఫోటోలను మరియు వీడియోలను తీసుకోవచ్చు. ఇందులో 24MP +8MP+2MP ట్రిపుల్ రియర్ కెమేరా సేటప్పును అందించారు. ఈ P30 ఒక 6.15 -అంగుళాల పూర్తి HD + TFT LCD IPS పానెల్, 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషనుతో మరియు 19.5:9 వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు ఒక కిరిన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగివుంటుంది. అయితే, ఇది కేవలం 4GB RAM మరియు 128GB స్టోరేజితో మాత్రమే అందించబడుతోంది.
ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక 8MP+25MP +5MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. A50 స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart నుండి Amazon నుండి రూ. 19,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 7 Pro, ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్, కేవలం షావోమి మాత్రమే అందించింది. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క కెమేరాతో గొప్ప రిజల్యూషన్ ఫోటోలను తీసుకోవచ్చు. అంతేకాదు, ఇందులో తీసిన ఫోటోలను జూమ్ చేసి చూసినా కూడా పిక్సెళ్ళు అంతగా విడిపోవడం జరగదు
శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఏప్రిల్ 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Amazon.in నుండి కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ 3 ప్రో స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8% స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 16MP కెమేరాకు జతగా f/2.4 అపర్చరు కలిగిన మరొక 5MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఈ ప్రాధాన 16MP కెమెరా ఒక SonyIMX519 సెన్సారుతో వస్తుంది.