Smartphone: 6 వేలకే DTS స్పీకర్లు మరియు 8GB RAM ఫోన్ కావాలా.!
6 వేలకే DTS స్పీకర్లు మరియు 8GB RAM ఫోన్
ఈ కొత్త ఫోన్ పైన ఒక లుక్కేయండి
ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ నుండి లభిస్తుంది
Smartphone: 6 వేలకే DTS స్పీకర్లు మరియు 8GB RAM ఫోన్ కావాలా? అయితే, ఈ కొత్త ఫోన్ పైన ఒక లుక్కేయండి. టెక్నో ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన TECNO POP 8 స్మార్ట్ ఫోన్ ఈ ఫీచర్లు కలిగిన బెస్ట్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ లో కొత్త విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ 6వేల ధరలో మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యింది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ ఫోన్ ఎటువంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నదో తెలుసుకోండి.
SurveyBudget Smartphone
TECNO POP 8 స్మార్ట్ ఫోన్ ను సింగల్ వేరియంట్ ను 4GB +64GB తో రూ. 6,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అమేజాన్ మరియు టెక్నో అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది. అమేజాన్ నుండి ఈ ఫోన్ ను నేరుగా కొనుగోలు చెయ్యడానికి Buy From Here పైన క్లిక్ చెయ్యండి.
Also Read : Jio New Offer: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో.!
TECNO POP 8
ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ HD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 4GB RAM + 4GB Memory Fusion ర్యామ్ తో కలిపి టోటల్ 8GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు SD card ద్వారా 1TB వరకూ మెమెరీని పెంచుకునే అవకాశం కూడా వుంది.
ఈ ఫోన్ లో DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్ కేటగిరిలో ఈ ఫీచర్ కలిగిన ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక 12MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ ను రెగ్యులర్ 10W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో టెక్నో లాంచ్ చేసింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile