అసూస్ నుండి ఒక 48 MP ప్రధాన కెమేరాతో డ్యూయల్ ఫ్లిప్ కెమెరా ఫీచర్లతో వచ్చిన, ASUS Z6 స్మార్ట్ ఫోన్, ఇక ఇండియాలో విడుదలవడానికి సిద్ధమైంది. ఈ ఫోన్, వేనుక మరియు ముందుకు మార్చుకునేలా ఒక ఏర్పాటుగాల ప్రధాన 48MP కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే, ఈ 48MP కెమెరా Sony IMX సెన్సారుతో ఉంటుంది. అంతేకాదు, ఇది వేగవంతమైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసరు మరియు మరెన్నో ప్రత్యేకతలతో వస్తుంది. దీని యొక్క పూర్త వివరాలతో దీని కోసం ఒక ప్రత్యేకమైన పేజీని, Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా 92% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2340X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD + నానో ఎడ్జ్ డిస్పీలతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 855 7nm ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి వరకూ అందించబడింది. ఈ అసూస్ 6Z, మరింత ఛార్జింగ్ వేగాన్ని అందించగల Quick Charge 4.0 సపోర్టు కలిగిన ఒక పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విభాగానికి వస్తే, అసూస్ 6Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 48MP + 13MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.79 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీసుకోవడానికి, దానిలో ముందుగా అందించిన అల్ట్రా నైట్ మోడ్ తో దాని భారీ 48MP సెన్సార్ను కలుపుతుంది. ఈ 48MP కెమెరా ఒక Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక రెండవ కెమేరా విషయానికి వస్తే, ఇది 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ని ఇచ్చారు. ఈ కెమేరా సెటప్పును 'ఫ్లిప్ కెమేరా' కంపెనీ పిలుస్తోంది.