అసూస్ జెన్ ఫోన్ 5Z కోసం Android 10 అప్డేట్ విడుదల

అసూస్ జెన్ ఫోన్ 5Z కోసం Android 10 అప్డేట్ విడుదల
HIGHLIGHTS

స్థిరమైన ఆండ్రాయిడ్ 10 కు అప్డేట్ అందింది.

ఎట్టకేలకు, అసూస్ జెన్‌ ఫోన్ 5 జెడ్ స్మార్ట్‌ఫోన్ అసూస్ నుండి స్థిరమైన ఆండ్రాయిడ్ 10 కు అప్డేట్ అందింది. కొన్ని వారాల క్రితం, అసూస్ తన ప్రస్తుత ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ఫోన్ – ఆసుస్ 6 జెడ్ కోసం ఈ అప్డేట్ విడుదల చేసింది, మరియు ఇప్పుడు, దాని 2018 ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్‌ అయినటువంటి అసూస్ జెన్‌ ఫోన్ 5 జెడ్ కి కూడా   ఈ సరికొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ ఇవ్వబడింది. ఇతర దేశాలలో, అసూస్ జెన్‌ ఫోన్ 6 స్మార్ట్‌ ఫోన్ కోసం కూడా ఈ ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్‌ ను, అసూస్ విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ భారతదేశంలో ఇంకా లాంచ్ కాలేదు. ఈ రోల్‌ అవుట్‌తో, అసూస్ ROG ఫోన్ 2 ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ ను వచ్చే నెల తరువాత లేదా 2020 ప్రారంభంలో స్వీకరించడానికి అనుగుణంగా ఉంటుంది. ఫోటా దశలవారీగా విడుదల చేయబడుతుందని, రాబోయే కొద్ది వారాల్లో ఇది అన్ని అసూస్ జెన్‌ ఫోన్ 5 జెడ్‌ లకు చేరుకుంటుందని అసూస్ ఇండియా తెలిపింది.

అసూస్ 5Z ప్రత్యేకతలు      

ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా 90% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2246X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.2 అంగుళాల FHD + సూపర్ IPS+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 845 ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 6/8GB ర్యామ్ మరియు 256GB  వరకూ స్టోరేజితో  అందించబడింది. ఈ అసూస్ 5Z,  మరింత ఛార్జింగ్ వేగాన్ని అందించగల Quick Charge 3.0 సపోర్టు కలిగిన ఒక పెద్ద 3,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, అసూస్ 5Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 12MP + 8MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.8 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీస్తుంది. ఈ 12MP కెమెరా ఒక Sony IMX363 సెన్సారుతో వస్తుంది. ఇక రెండవ కెమేరా విషయానికి వస్తే, ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ని ఇచ్చారు. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ముందు ఒక 8MP సెల్ఫీ కెమేరాని అందించారు.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo