అసూస్ రెండు బడ్జెట్ ఫోన్లను అక్టోబర్ 17న ఆవిష్కరించనుంది. ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా రావచ్చు

అసూస్ రెండు బడ్జెట్ ఫోన్లను అక్టోబర్ 17న ఆవిష్కరించనుంది. ఈ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా రావచ్చు
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 10,000 రూపాయల సెగ్మెంట్లో ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 400 చిప్సెట్ సిరీస్ తో, షావోమి యొక్క రెడ్మి 6 మరియు రెడ్మి 6A ఫోన్లకు ప్రత్యర్థిగా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు.

ఈ తైవాన్ స్మార్ట్ ఫోన్ తయారీదారైన అసూస్, ఇండియాలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి మీడియా ఆహ్వానాలను పంపించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 17 వ తేదీన జరగనున్నట్లు తెలిపింది. అయితే, ఈ కార్యక్రమంలో ఏమి ఆవిష్కరించనుందో మాత్రం ఖచితముగా తెలియచేయలేదు. కానీ, వీటి మీద వచ్చిన పుకార్ల ప్రకారంగా, రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అవిష్కరించనుందని అవి 10,000 రూపాయల సెగ్మెంట్లో ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 400 చిప్సెట్ సిరీస్ తో,  షావోమి యొక్క రెడ్మి 6 మరియు రెడ్మి 6A ఫోన్లకు ప్రత్యర్థిగా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు            

ఇప్పుడు జరగనున్న ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్త విడుదల కార్యక్రమంగా ఉండనుంది. అంటే, రానున్న ఈ రెండు ఫోన్లు కూడా మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. TechSence చేసిన ఒక నివేదిక ప్రకారం, రానున్న రెండు ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 400 చిప్సెట్ సిరీస్ తో రానున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ప్రస్తుతం మీడియా టెక్ చిప్సెట్ తో వచ్చిన రెడ్మి 6 సిరీస్ ఫోన్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.  అలాగే, ముందు నుంచి కొనసాగుతున్న భాగస్వామ్యం కారణంగా వీటిని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఈ రానున్న ఫోన్లలో ఒకటి, జెన్ ఫోన్ మాక్స్ సిరీస్ వంటి  ఒక పెద్ద 5000mAh బ్యాటరీ కలిగివుంటుంది. ఇంకా అలాగే, వీటిలో ఒక ఫోన్ పైన 2.5D గ్లాస్ గల ఒక 5.5 అంగుళాల HD + డిస్ప్లే తో వస్తుంది మరియు వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ తో వస్తుంది.                              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo