వేగవంతమైన ప్రాసెసర్లు కలిగిన Asus 5Z మరియు Asus 6Z పైన భారీ తగ్గింపు

వేగవంతమైన ప్రాసెసర్లు కలిగిన Asus 5Z మరియు Asus 6Z పైన భారీ తగ్గింపు
HIGHLIGHTS

ఈ ఫోన్ల పైన గరిష్టంగా Rs. 5,000 వరకూ తగ్గింపు ప్రకటించింది

అసూస్ తన ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, అసూస్ 6 జెడ్ స్మార్ట్‌ ఫోన్ను 2019 లో విడుదల చేసింది మరియు ఇది  OnePlus 7 తో కూడా పోల్చబడింది. ముఖ్యంగా,  రొటేటింగ్ కెమెరా ఈ స్మార్ట్‌ ఫోను యొక్క ప్రత్యేకతలో మొదటగా వస్తుంది మరియు ఈ పోటీలో అగ్రస్థానంలో నిలిచేలాచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్‌లో 31,999 రూపాయల ధరతో లాంచ్ చేశారు మరియు ఫ్లిప్‌ కార్ట్ సేల్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ను డిస్కౌంట్ ధరతో అమ్ముడుచేశారు. అయితే, సంస్థ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌ పైన ఏకంగా 4,000 రూపాయల డిస్కౌంట్ ని ప్రకటించింది. గతేడాది, రూ .29,999 వద్ద లాంచ్ చేసిన ఆసుస్ 5 జెడ్ ధరను కూడా కంపెనీ తగ్గించింది. అసూస్ 5 జెడ్ ధరను కూడా రూ .5 వేలు వరకూ తగ్గించింది.

అసూస్ 5 Z మరియు అసూస్ 6 Z  కొత్త ధరలు

అసూస్ 6 Z ను ఇప్పుడు రూ .27,999 ధరకు కొనుగోలు చేయవచ్చు, అదనంగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ను రూ .30,999 కు విక్రయిస్తుండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .34,999 రూపాయలుగా ఉంది. ఇక ఆసుస్ 5 Z యొక్క కొత్త ధరల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ పైన ప్రకటించిన 5,000 రూపాయల డిస్కౌంట్ తరువాత, 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ రూ .16,999 ధరతో అమ్ముడవుతోంది. ఈ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ .18,999 కు, టాప్ వేరియంట్ 21,999 రూపాయలకు అమ్ముడవుతోంది.

అసూస్ 6Z ప్రత్యేకతలు        

ఈ స్మార్ట్ ఫోన్, అత్యధికంగా 92% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2340X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD + నానో ఎడ్జ్ డిస్పీలతో వస్తుంది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 855 7nm ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి వరకూ అందించబడింది. ఈ అసూస్ 6Z,  మరింత ఛార్జింగ్ వేగాన్ని అందించగల Quick Charge 4.0 సపోర్టు కలిగిన ఒక పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, అసూస్ 6Z వెనుక మరియు ముందుకు మార్చుకోగలిగేలా ఉండే ఒక 48MP + 13MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.79 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీసుకోవడానికి, దానిలో ముందుగా అందించిన అల్ట్రా నైట్ మోడ్ తో  దాని భారీ 48MP  సెన్సార్ను కలుపుతుంది. ఈ 48MP కెమెరా ఒక Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఇక రెండవ కెమేరా విషయానికి వస్తే, ఇది 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ని ఇచ్చారు. ఈ కెమేరా సెటప్పును 'ఫ్లిప్ కెమేరా' కంపెనీ పిలుస్తోంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo