Asus 8z: కాంపాక్ట్ సైజ్ మరియు హై ఎండ్ ఫీచర్లతో వచ్చింది

HIGHLIGHTS

ASUS ఇండియాలో ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది

Asus 8z ఫోన్ ను కాంపాక్ట్ సైజ్ మరియు హై ఎండ్ ఫీచర్లతో తీసుకొచ్చింది

5.9 ఇంచ్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది

Asus 8z: కాంపాక్ట్ సైజ్ మరియు హై ఎండ్ ఫీచర్లతో వచ్చింది

ASUS ఇండియాలో ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. Asus 8z ఫోన్ ను కాంపాక్ట్ సైజ్ మరియు హై ఎండ్ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ను స్నాప్‌డ్రాగన్ 888 Soc,120Hz FHD+ AMOLED స్క్రీన్ మరియు మరిన్ని ఫీచర్లను ఈ ఫోన్ లో అందించింది. ఒక స్మార్ట్ ఫోన్ లో అవసరమైన మరియు సరైన ఫీచర్లతో ఈ ఫోన్ అసూస్ అందించింది.             

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Asus 8z: స్పెక్స్

ఈ అసూస్ 8z 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 5.9 ఇంచ్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ CPU మరియు Adreno 660 GPU తో ఉంటుంది. దీనికి జతగా  గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

Asus 8z-3.jpg

కెమెరా విభాగంలో, ఈ లేటెస్ట్ అసూస్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు తో ఉంది. ఈ డ్యూయల్ కెమెరాలో OIS సపోర్ట్ కలిగిన 64MP SonyIMX686 ప్రధాన కెమెరాకి జతగా  12MP అల్ట్రా వైడ్ కెమెరా సపోర్ట్ తో వస్తుంది. ముందుభాగంలో, 12MP డ్యూయల్ పిక్స్లల్  కెమెరాని SonyIMX 363 సెన్సార్ తో ఇచ్చింది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అలాగే,ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS ఆధారితంగా Zen UI 8 స్కిన్ పైన పనిచేస్తుంది. ఆడియో పరంగా, డ్యూయల్ స్పీకర్లను Hi-Res మరియు Derac Audio సపోర్ట్ తో వస్తుంది.

Asus 8z: ధర మరియు సేల్

అసూస్ 8z సింగల్ వేరియంట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.42,999 రూపాయల ధరతో వచ్చింది. ఈ ఫోన్ మార్చ్ 7వ తేది మద్యహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo